అయితే కార్తీక్ అనే రచయిత ఆ సంఘటన ఆధారంగా కథను రాసుకున్నారు .. ఇక ఆ కథ చైతు కంటే ముందు కొందరి హీరోల దగ్గరికి వెళ్ళింది .. అలాగే చైతు కూడా కథ విన్నప్పుడు పాయింట్ బాగుంది కానీ స్క్రీన్ ప్లే అంతా డాక్యుమెంటరీ లా అనిపించింది అన్నాడట .. ఇదే విషయాన్ని నాగచైతన్య స్వయంగా ఈవెంట్లో చెప్పారు .. కథ విన్నప్పుడు సమాచారం అంతా గుదిగుచ్చినట్లుగా అనిపించింది .. ఈ కథలో సినిమాటిక్ గ్రామర్ ఎక్కడ కనిపించలేదు .. అయితే ఈ స్టోరీ ని బన్నీ వాస్ తన దగ్గర హోల్డ్ లో పెట్టుకున్నారు .. స్టోరీలో ఉన్న పాయింట్ని కమర్షియల్ గా మార్చి ఓ సినిమాకు తగ్గట్టుగా చేయగలిగితే తాను ఈ సినిమా చేస్తానని చైతు బన్నీ వాసుకి మాటిచ్చారట.
అయితే ఇదే క్రమంలో దర్శకుడుచందూ మొండేటి ఇందులో అడుగుపెట్టి కథని పూర్తిగా లవ్ స్టోరీ గా మార్చి జరిగిన కథకు 50% ఫిక్షన్ జోడించి సినిమాటిక్ గా తయారుచేయడంతో చైతన్యకి నచ్చింది .. అలా ఈ కథ సినిమాగా వచ్చింది .. కొన్ని యథార్థ సంఘటనలను ఆధారంగా సినిమా తీస్తున్నప్పుడు కమర్షియల్ గా వర్క్ కావాలంటే ఎంతో కొంత ఫిక్షన్ ను జోడించాల్సిందే .. ఇక మరి ఇప్పుడు చందు జోడించిన ఫిక్షన్ వాస్తవ కథకు ఏ మేరకు ప్లస్ అవుతుందనేది చూడాలి.