మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రీసెంట్గా దేవర సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ద‌గ్గ‌ర‌ సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు .. త్రిబుల్ ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన దేవర ఎన్టీఆర్ ను సోలోగా ఇండియన్ బాక్సాఫీస్ కు బాద్షాను చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 550 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టి నయా రికార్డును క్రియేట్ చేసింది .. దేవర తర్వాత ఎన్టీఆర్ వరుసగా భారీ సినిమాలను లైన్లో పెట్టారు .. దేవర సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇప్పటికే మొదటి భాగం విడుదలై భారీ విజయం అందుకోవటంతో ఇప్పుడు రెండో భాగం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.


అలాగే ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో వార్ 2 లో నటిస్తున్నాడు ఎన్టీఆర్ .. బాలీవుడ్ స్టార్  హృతిక్ రోషన్ తో కలిసి ఈ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే చివరి దశకు వచ్చింది .. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎలాంటి పాత్రలో నటిస్తున్నానన్నది మాత్రం క్లారిటీ లేదు .. అలాగే ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ భారీ సినిమా చేయనున్నారు .. ఆ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. కేజిఎఫ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రశాంత్ నీల్‌ తర్వాత సలార్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకుల‌కు బాగా దగ్గరయ్యారు ..


సలార్‌ సినిమాను ప్రశాంత్ రెండు భాగాలుగా ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు .. ఇక ఈ సినిమాలతో పాటు ఎన్టీఆర్ తో ఓ భారీ సినిమాని కూడా ప్రకటించారు .. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ మూవీపై ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి .. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమాల్లో మలయాళ స్టార్ హీరో నటిస్తున్నాడని వార్త బయటకు వచ్చింది .. ఎన్టీఆర్ సినిమాలు టోవినో థామస్ కీలకపాత్రలో నటిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది .. ఇప్పటికే సలార్ లో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన విషయం తెలిసిందే .. ఇప్పుడు ఎన్టీఆర్ తో చేసే సినిమాలోను ప్రశాంత్ మలయాళ హీరో టోవినో థామస్  తీసుకుంటున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: