ప్రజెంట్ ప్రభాస్ తో చేసే సినిమా పనిలో బిజీగా ఉన్నాడు .. ఈ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ను కూడా కన్ఫర్మ్ చేశాడు .. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ని యాంగ్రీ పోలీస్ ఆఫీసర్గా చూపించబోతున్నాడు సందీప్ .. గత కొన్ని నెలలుగా వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. . అయితే ఇప్పుడు మరో స్టార్ హీరోతో సందీప్ రెడ్డివంగా ఓ భారీ సినిమా చేయబోతున్నాడా ? అనే చర్చ మొదలయింది .. సందీప్ మహేష్ బాబుతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .. కానీ అది సెట్ కాలేదు .. ఎప్పటికైనా మహేష్ తో సినిమా చేస్తాని ఈ రౌడీ డైరెక్టర్ అంటున్నాడు.
అయితే ఇప్పుడు మెగాస్టార్ తో సందీప్ రెడ్డి వంగ సినిమా చేయబోతున్నారని టాక్ గట్టిగా వైరల్ అవుతుంది .. సందీప్ , చిరంజీవి సినిమా ఫిక్స్ అయిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది .. ఇప్పటికే చిరంజీవి , సందీప్ రెడ్డి తో చర్చలు కూడా జరిగినట్టు వార్తలు వస్తున్నాయి .. సందీప్ స్టైల్ వేరు చిరంజీవి ఇమేజ్ వేరు ఇప్పుడు ఇద్దరి కాంబోలో సినిమా అని టాక్ వినపడగానే అభిమానులలో ఎంతో ఆసక్తి నెలకుంది .. ఈ ఇద్దరు కాంబోలో సినిమా ఎలా ఉంటుందో అభిమానులు ఎన్నో కళ్ళు కంటున్నారు .. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముంది అనేది తెలియాల్సి ఉంది. ఇక త్వరలోనే దీనిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.