పెద్దకాపు హిట్ అయితే పెద్ద కాపు 2 తీసే వాళ్ళు కానీ ఆ ప్రాజెక్ట్ అక్కడే ఆగిపోయింది. ఆ తర్వాత ఓ కన్నడ హీరో కోసం ఒక కథను కూడా రాశారు .. అది సెట్స్ పైకి వెళ్ళేలోపే ఆ హీరో మర్డర్ కేసులో జైల్లో ఉన్నాడు . ఇక దాంతో ఆ ప్రాజెక్టు కూడా ఆగిపోయింది .. ఇక ఇప్పుడు తనదైన స్టైల్ లో ఓ చిన్న సినిమా చేయాలని శ్రీకాంత్ భావిస్తున్నాడు .. కూచిపూడి వారి వీధి అనే టైటిల్ కూడా కన్ఫామ్ చేసుకున్నారు .. ఇద్దరు అక్కచెల్లెళ్ల కథ ఇది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఇద్దరు అన్నదమ్ముల కథ చూపించాడు ..
ఇక ఇప్పుడు సిస్టర్ సెంటిమెంట్ తో ట్రాక్లోకి రావాలని చూస్తున్నాడు .. దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించే అవకాశం కూడా ఉంది .. ఈ సినిమా కోసం ఇద్దరు గొప్ప హీరోయిన్లు కావాలి అందుకోసం వేట కూడా మొదలైంది ,, హీరోయిన్ లు ఫిక్స్ అయితే ఈ ప్రాజెక్టు గురించి అధికార ప్రకటన రానుంది .. అంతేకాకుండా శ్రీకాంత్ మరో కథను కూడా రెడీ చేసుకున్నాడు .. పలువురు నిర్మాతల కూడా ఇప్పటికే శ్రీకాంత్ తో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు .. తగిన స్టార్ కాస్ట్ మాత్రం కన్ఫర్మ్ కావాల్సి ఉంది. ఇక మరి ఈ సినిమాలతో ఈ ఫ్యామిలీ దర్శకుడు మరోసారి ట్రాక్లోకి వస్తాడో లేదో చూడాలి.