విజయేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ భారతీయ సినిమాల్లో అడ్వెంచర్ థ్రిల్లర్ జానర్‌లో భారీ బడ్జెట్ సినిమాలు ఎవరూ చేయలేదు .. సరిగ్గా ఎక్స్‌ప్లోర్ కూడా చేయలేదు .. ప్రెసెంట్ గ్లోబల్ మార్కెట్ అంతా భారత్ వైపు చూస్తుంది . ఈ క్రమంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం అలాగే మహేష్ ఇప్పటివరకు ఇలాంటి జోనర్లో నటించలేదు .. కాబట్టి ఈ స్టోరీకి మహేష్ సూట్ అవుతారని భావించి ఆయనతో ఇలాంటి స్టోరీ చేస్తున్నాం. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు ..
ప్రెసెంట్ కన్యాలో మహేష్ బాబు ప్రియాంక చోప్రా ఇతర క్యాస్టింగ్ తో షూటింగ్ నిర్వహిస్తున్నారు .. అయితే అందరూ అనుకుంటున్నాట్టు ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ కాదట ఆమె విలన్ రోల్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది .. అలాగే మహేష్ కు జంటగా హీరోయిన్ కోసం మరో హాలీవుడ్ బ్యూటీ ని కన్ఫామ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు రాజమౌళి ఈ సినిమా కోసం నటీనటులు , సాంకేతిక నిప్పులతో నాన్-డిస్‌క్లోజ్ అగ్రిమెంట్ (NDA) రాయించుకున్నట్టు తెలుస్తుంది . ఈ సినిమా విషయంలో ఎలాంటి లీకులు బయటికి రాకుండా చిత్ర బంధం భారీ ప్లాన్ వేసింది.