![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/uday-kiran-wife-vishtiha-working-saft-wearfed758a7-7cc4-4988-9652-1b8eafcd1dc1-415x250.jpg)
ఉదయ్ కిరణ్ భార్య విషిత గురించి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈమె అమెరికాకు వెళ్లిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఉదయ్ కిరణ్ ను డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురావాలని ఆయన భార్య విషిత ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేసిందట.అయినప్పటికీ కూడా ఉదయ్ కిరణ్ డైలమాలోపడి.. తీవ్ర డిప్రెషన్ కి గురై ఆత్మహత్య చేసుకున్నారు..అయితే ఉదయ్ కిరణ్ వైఫ్ విషిత ఈ విషయాన్ని మాత్రం జీర్ణించుకోలేక పోయిందట. కొన్నేళ్లపాటు తన జ్ఞాపకాలతోనే బతికిన ఈమె ప్రస్తుతం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఉదయ్ కిరణ్ మరణాంతరం కూడా ఆమె మరొక వివాహం చేసుకోలేదని జాబ్ చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నదట విషిత. ఉదయ్ కిరణ్ చిత్రం సినిమాతో మంచి విజయాన్ని అందుకొని ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే, హోలీ, కలుసుకోవాలని నీ స్నేహం తదితర చిత్రాలలో కూడా నటించి మంచి విజయాలను అందుకున్నారు. అయితే సడన్గా వరుస ఫ్లాపులు రావడంతో ఉదయ్ కిరణ్ జీవితం ఒక్కసారిగా తలకిందులు అయ్యిందట. ఉదయ్ కిరణ్ తో నటించిన హీరోయిన్స్, డైరెక్టర్స్, యాక్టర్స్ కూడా అప్పుడప్పుడు ఉదయ్ కిరణ్ మంచి తనాన్ని తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి.