- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా వివరాలు సేకరించిన సిపిఐ నేత..

నెలవారి రిటర్న్స్ ను సమర్పించిన సినిమా నిర్మాతలు..

రూ. 110 కోట్ల పన్ను చెల్లించిన నిర్మాతలు ..

ప్రత్యేకంగా పుష్ప2కు సంబంధించి చెల్లింపు వివరాలు చెప్పలేమన్న అధికారులు..


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన పుష్పా 2 ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించి భారీ కలెక్షన్లు రాబట్టి భారతీయ సినిమా చరిత్ర లోనే హైయెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమా గా నిలిచింది .. ఇక ఈ సినిమా కలెక్షన్ల కు సంబంధించి ఎంత పన్ను చెల్లించారో తెలుసా ? దీనిపై సిపిఐ నాయకుడు సి. శోభన్ సమాచార హక్కు చట్టం కింద వాణిజ్య పన్నుల శాఖ ద్వారా పుష్ప 2 పన్ను చెల్లింపుల వివరాలను సేకరించారు . ఇక ఈ సినిమాకు సంబంధించి నెల వారి జీఎస్టీఆర్ -3 బీ , జీఎస్టీఆర్ -01 రిటర్న్స్‌ను కమర్షియల్ ట్యాక్స్ శాఖ కు సమర్పించారు ..


ఇక ఇందు లో సినిమాకు సంబంధించిన వాటి తో పాటు ఇతర రిటర్స్ ను కూడా ఉండవచ్చని అధికారులు చెప్పుకొచ్చారు .. ఇక ప్రధానంగా పుష్పా 2 సినిమాకు సంబంధించిన రెవెన్యూ బ్రేక్ చెప్పలేమని , కానీ వారి నుంచి నవంబర్ , డిసెంబర్ నెలలో గాను వచ్చిన పన్నులు మాత్రం 110 కోట్లు వరకు ఉన్నట్లు చెప్పుకు వచ్చారు .. అలాగే ఈ రెండు నెలల టర్నోవర్ 642 కోట్లగా వెల్లడించారు .. ఇక ఇందులో సినిమా శాశాటిలైట్ రైట్స్ అమ్మకం , ఓటీటీ రైట్స్ , ఓవర్సీస్ ఆడియో రైట్స్ ద్వారా వచ్చిన ఆదాయం కూడా ఉండవచ్చు అని చెప్పకు వచ్చారు . అయితే ఇది జీఎస్టీ ట్యాక్స్ మాత్రమేనా ? ఇందులో ఇన్‌కమ్ ట్యాక్స్ కూడా కలిసే ఉందా ? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. దీనికి సంబంధించి మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా స్పందించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: