![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/silk-smitha8df23b15-2381-4762-940f-3414500bde21-415x250.jpg)
అలాంటి ఈమె గురించి ఒకప్పటి సీనియర్ నటి జయశీల పలు కీలక వ్యాఖ్యలు చేశారు .. రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ .. అందులో సిల్క్ స్మిత ప్రస్తావన వచ్చింది .. ఆమె గురించి స్పందిస్తూ సిల్క్ స్మిత ఎంతో మంచి అమ్మాయి .. నేను తాను ఒకేసారి ఇండస్ట్రీలో అడుగు పెట్టాము .. ఇక సిల్క్ స్మిత ఎంతో కష్టపడి పైకి వచ్చింది .. ఎన్నో అవమానాలను ఎదుర్కొంది .. ఎవరైనా ఏదైనా అంటే తిరిగి ఏమీ అనేది కాదు .. కానీ ఆ విషయాలన్నీ మర్చిపోకుండా మనసులో పెట్టుకునేది తనని చులకనగా చూసిన హీరోల ముందే సెట్లు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం ఆమెకే చెల్లింది అని ఆమె అన్నారు.
అలాగే సిల్క్ స్మిత ఒక వ్యక్తితో కలిసి ఎక్కువగా ఉండేది .. అతను ఆమె సంపాదించిందంతా దోచేసుకున్నాడు .. అలాగే అతని కొడుకుతో సిల్క్ స్మిత ప్రేమలో పడింది ..ఆమె మరణానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు .. ఇక సిల్క్ స్మిత కి పెళ్లి చేసుకోవాలని .. అమ్మ అని పిలిపించుకోవాలని కోరిక ఎంతో ఉండేది .. పాపం ఆ కోరిక నెరవేరకుండానే ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది .. సిల్క్ స్మిత ఫటాఫట్ జయలక్ష్మి నాతో ఎంతో స్నేహంగా ఉండేవారు వాళ్ళిద్దరూ చనిపోవడం నాకు ఎంతో బాధ కలిగించిందని జయశీల ఆ ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చారు .. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.