యువతుకు సంబంధించి ప్రైవేట్ వీడియోలను సైతం సేకరించి వారిని బెదిరిస్తూ ఉన్నారని ఆరోపణలు మస్తాన్ సాయి పైన రావడంతో ఇటీవలే పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.అయితే ఈ కేసులో రోజుకోక ట్విస్ట్ కూడా వెలుగులోకి వస్తూనే ఉన్నది. మస్తాన్ సాయితో పాటుగా బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ భాష పైన కూడా లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయి పైన లావణ్య ఫిర్యాదు చేయడంతో అధికారులు అతని దగ్గర నుంచి ఒక హార్డ్ డిస్క్ ని కూడా స్వాధీనం చేసుకున్నారట.

అయితే ఈ హార్డ్ డిస్క్ లో మహిళలకు చెందిన ఫోటోలు వీడియోలు ఉన్నాయని కూడా తెలిపారు. ఈ హార్డ్ డిస్క్ కోసమే తన పైన దాడి చేసేందుకు వచ్చారు అంటూ అటు మస్తాన్ సాయి ,ఖాజా పైన లావణ్య ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఫిబ్రవరి 4వ తేదీన మస్తాన్ తో పాటుగా ఖాజాను నార్సింగ్ పోలీసులు అరెస్టు చేశారు... అయితే రిమాండ్ రిపోర్టులో సైతం పోలీసులకు పలు విషయాలను తెలియజేశారట మస్తాన్ సాయి..



ముఖ్యంగా తనకు ఉనీత్ రెడ్డి అనే ఫ్రెండ్ వల్లే మస్తాన్ సాయితో లావణ్య కు పరిచయం ఏర్పడిందని తెలిపారట.. ఒక ఫంక్షన్ వల్ల మస్తాన్ సాయి ఇంటికి వెళ్లిన లావణ్య ఆ సమయంలో ఆమె బట్టలు మార్చుకుంటూ ఉండగా వీడియో తీశారని.. ఆ వీడియోని తన స్నేహితులకు కూడా షేర్ చేశారంటూ రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. అప్పటినుంచి మస్తాన్ సాయి, లావణ్య కు గొడవ మొదలైందని.. ఈ విషయం పైన రాజ్ తరుణ్ ఇద్దరిని రాజు చేశారని తెలిపారు పోలీసులు. రాజ్ తరుణ్ ఆ వీడియోలను కూడా డిలీట్ చేయించేలా చేసిన హార్డ్ డిస్క్ లో మస్తాన్ సాయి సేవ్ చేసుకున్నారని .. ఈ హార్డ్ డిస్క్ ని గత ఏడాది లావణ్య మస్తాన్ సాయి ఇంటి నుంచి తీసుకువచ్చిందట.


దీంతో మస్తాన్ సాయి, లావణ్య అని చంపేందుకు కూడా ప్రయత్నించారని పోలీసులు తెలియజేశారు. మస్తాన్ సాయి, ఖాజా దగ్గర డ్రగ్స్ ఆడవాళ్లు కూడా లభించాయట. మొత్తానికి ఈ కేసు ఎటు నుంచి ఎటు వెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: