టాలీవుడ్ లవ్ బర్డ్స్ అనగానే విజయ్ రష్మికలే గుర్తుకొస్తారు.అయితే అనుష్క ప్రభాస్, తమన్నా విజయ్ వర్మ పేర్లు వచ్చినప్పటికీ అనుష్క ప్రభాస్ లు అంత పబ్లిక్ గా తిరగరు.ఇక తమన్నా విజయ్ వర్మ లు తమ ప్రేమని బయటపెట్టారు. కానీ విజయ్ రష్మికలు మాత్రమే తమ ప్రేమను బయట పెట్టకుండా రిలేషన్ లో ఉన్నాము కానీ వాళ్ళ పేర్లు చెప్పలేం అని సైలెంట్ గా వెకేషన్లు, పార్టీలు అంటూ తిరుగుతూ ప్రతిసారి మీడియా ముందు అడ్డంగా బుక్ అవుతూ ఉంటారు.కానీ ఈ ఇద్దరు ఇప్పటివరకు నేను రష్మికను ప్రేమిస్తున్నానని విజయ్, నేను విజయ్ ని ప్రేమిస్తున్నానని రష్మిక మాత్రం ఎక్కడా చెప్పలేదు. అయితే తాజాగా విజయ్ కి రష్మిక బ్రేకప్ చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలకు ప్రధాన కారణం రష్మిక పెట్టిన పోస్టే. మరి ఇంతకీ రష్మిక తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఏంటయ్యా అంటే.. రష్మిక తాజాగా వైట్ కలర్ టీషర్ట్ వేసుకున్న ఫోటో షేర్ చేసింది. అయితే ఆ ఫోటోపై కైండ్ నెస్ అని రాసి ఉంది. 

అలాగే ఆ ఫోటో కింద ఇప్పటి రోజుల్లో చాలామందికి దయ అనేది తగ్గిపోతుంది. కానీ నేను మాత్రం అందరిని దయతోనే చూస్తాను. మీరు కూడా అందరిపై దయ చూపించండి. ఒకరిపై ఒకరు దయతో మెదలండి అంటూ రాస్కొచ్చింది. ఇక రష్మిక పెట్టిన పోస్ట్ విజయ్ దేవరకొండ గురించే అని చాలామంది గుసగుసలు పెట్టుకుంటున్నారు. దానికి కారణం రీసెంట్గా రష్మిక విజయ్ లకు సంబంధించి ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది.అయితే ఆ వీడియోలో ఏముందంటే.. రష్మిక మందన్నా విజయ్ దేవరకొండ ఇద్దరు కలిసి ఒక జిమ్ నుండి బయటికి వచ్చారు.అయితే ఇద్దరు కలిసి జిమ్ లో ఎక్సర్సైజులు చేశాక విజయ్ ముందుగా వచ్చి కారు ఎక్కారు.

 కానీ ఆ తర్వాత నడవలేని పరిస్థితిలో ఉన్న రష్మిక ని కనీసం పట్టించుకోకుండా విజయ్ ప్రవర్తించడంతో చాలామంది నెటిజెన్స్ విజయ్ ప్రవర్తన పై విమర్శలు చేశారు. నడవలేని స్థితిలో ఉన్న రష్మికను కనీసం పట్టుకోవడం లేదు అని ట్రోల్స్ చేశారు. అయితే ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది.ఇక ఈ వీడియోకి రష్మిక పెట్టిన పోస్ట్ కి లింకు చేస్తూ విజయ్ దేవరకొండ నడవలేని పరిస్థితిలో ఉన్న రష్మిక పై కనీసం దయ చూపించకుండా పట్టించుకోలేదు కాబట్టి ఆ ఉద్దేశంతోనే రష్మిక ఈ దయ అని పేరు వచ్చేలా పోస్ట్ పెట్టింది అని చాలామంది అనుకుంటున్నారు.అంతేకాదు ఈ ఒక్క వీడియోతో రష్మిక విజయ్ కి బ్రేకప్ చెప్పింది కావచ్చు.. వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి కావచ్చు అని ప్రచారం కూడా జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: