టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో యంగ్ బ్యూటీ కృతి శెట్టి ఒకరు. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈ సినిమాలో తనదైన నటన, అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా అనంతరం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ కృతి శెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఈ అమ్మడుతో సినిమాలు చేయడానికి ప్రతి ఒక్క దర్శకుడు ఆసక్తిని చూపించారు. ఎప్పటికప్పుడు వరుసగా సినిమాలతో తన హవాను కొనసాగించిన ఈ చిన్నది ప్రస్తుతం సినిమాలలో పెద్దగా నటించడం లేదు.
ఉప్పెన సినిమా తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలు మంచి సక్సెస్ అందించాయి. అనంతరం కృతి నటించిన సినిమాలు డిజాస్టర్ గా మారిపోయాయి. దీంతో కృతికి తెలుగులో సినిమా అవకాశాలు రావడం లేదు. ఏవో కొన్ని సినిమాల్లో మాత్రమే హీరోయిన్ గా చేస్తోంది. ఈ మధ్యకాలంలో మలయాళం, తమిళంలో సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. తమిళంలో కృతి శెట్టి రెండు సినిమాలు చేస్తోంది.
మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. కాగా, ఈ బ్యూటీకి బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్ చేసే ఆఫర్ వచ్చిందట. దీంతో వెంటనే ఈ బ్యూటీ ఓకే చేసిందట. ఐటమ్ సాంగ్ కి ఈ బ్యూటీ ఎంతవరకు న్యాయం చేస్తుందా అనే సందేహాలు చాలా మందిలో వ్యక్తం అవుతున్నాయి. సినిమాలలో అవకాశాలు రాకపోవడంతో ఈ బ్యూటీ ఐటమ్ సాంగ్ కి ఓకే చేసిందని కొంతమంది అంటున్నారు. మరి ఐటమ్ సాంగ్ తో కృతి శెట్టి ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.