![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_gossips/ram-charan2eba1e4f-1ebf-4fad-84a8-c3bbe9066057-415x250.jpg)
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన నటనతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా మెగా కుటుంబానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. చిరంజీవి వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన రామ్ చరణ్ ఎంతోమంది అభిమానులను తన సినిమాల ద్వారా ఆకట్టుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారాడు.
ఈ సినిమా అనంతరం రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్ తన తదుపరి సినిమాను బుచ్చి బాబుతో చేయబోతున్నారు. రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా ప్రారంభించారు. ఆర్సి16 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు పిరియాడిక్ స్టోరీతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా విజయవంతంగా పూర్తయ్యాయి.
ఇక ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్లు వస్తాయా అని మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా, ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించబోతోంది. తెలుగులో జాన్వి నటించబోయే రెండో తెలుగు సినిమా కావడం విశేషం. కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్, జగపతిబాబు వంటి నటీమణులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది.
ఇదిలా ఉండగా... రామ్ చరణ్ ఆర్సి16 సెట్ లో తన కూతురు క్లింకారాను తీసుకువచ్చారు. అక్కడ చరణ్ కుమార్తె క్లింకారా సందడి చేసింది. కాగా, హైదరాబాద్ శివార్లలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా... తన కుమార్తెను ఎత్తుకొని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. మరి ఈ సినిమాలో చరణ్ కూతురు ఏదైనా చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ చేస్తుందా అనే సందేహాలు చాలామందిలో వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.