ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుని భారీగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తన తదుపరి సినిమా గురించి ఆలోచనలో ఉన్నారట. ఇదిలా ఉండగా.... నందమూరి నటసింహం బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్మభూషణ్ అవార్డును అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
50 సంవత్సరాల పాటు బాలయ్య బాబు తెలుగు సినీ ఇండస్ట్రీకి చేస్తున్న సేవలకు గాను, బసవతారం క్యాన్సర్ ఆసుపత్రి తరపున పేదలకు చేస్తున్న సేవలను గుర్తించి నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా బాలకృష్ణ సోదరి చంద్రబాబు సతీమణి, నారా భువనేశ్వరి గ్రాండ్ గా పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, విదేశాలలోని సెలబ్రిటీలు అందరూ వచ్చి పార్టీలో సందడి చేశారు. అయితే ఈ అవార్డు వచ్చిన సంతోషంలో జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా బాలయ్య బాబు ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పాలని అనుకుంటున్నారట.
మరి బాలయ్య బాబు ఎన్టీఆర్ కి అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనే సందేహంలో చాలామంది ఉన్నారు. ఈ రెండు కుటుంబాల మధ్య ఏవో కొన్ని గొడవలు ఉన్నందు వల్లే వీరు ఫ్యామిలీ ఫంక్షన్లలో కలుసుకోరని, పెద్దగా మాట్లాడు కోరనే ప్రచారాలు జోరుగా సాగుతాయి. మరి పద్మభూషణ్ అవార్డు వచ్చిన సంతోషంలోనైనా బాలయ్య బాబు ఎన్టీఆర్ ను కలుస్తారా? లేదా? తన ఇంటికి ఆహ్వానిస్తారా లేదా అనే సందేహంలో చాలామంది ఉన్నారు.