ఓటీటీ ప్లాట్‌ఫామ్స్లో నెట్ఫ్లిక్ టాప్ ప్లేస్లో దూసుకెళ్తుంటుంది. అన్ని జానర్లలో భిన్న కంటెంట్, సినిమా, సిరీసులతో ఓటీటీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. అయితే ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్లో టాప్ 10 ట్రెండింగ్‌లో ఉన్న సినిమాలలో పుష్ప 2: ది రూల్ రీలోడెడ్ వెర్షన్  నెం. 1 స్థానంలో ఉంది.ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2’ డిసెంబర్ 5 ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంచలన విజయం సాధించింది. ఇండియన్ భాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా చరిత్ర సృష్టించింది. ఏకంగా రూ.800 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూల్ చేసి బాలీవుడ్ కే షాకిచ్చింది. ఇక, ప్రపంచవ్యాప్తంగా రూ.1850 కోట్లకు పైగా వసూల్ చేసింది. బిగ్ స్క్రీన్ పై సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఇటీవల ఓటీటీలో విడుదల అయ్యింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఓటీటీలోనూ సంచలనం సృష్టిస్తోంది. ఏకంగా 5.8 మిలియన్స్ వ్యూస్‌తో ఏడు దేశాల్లో టాప్‌లో కొనసాగుతోంది.అయితే తొలుత ఈ చిత్రం 3 గంటల 20 నిమిషాల నిడివితో విడుదవ్వగా, తాజాగా మరో 20 నిమిషాలకు ఎక్స్టెండ్ చేసి రీలోడెడ్ వెర్షన్ను థియేటర్లలో వేశారు. దీంతో సినిమా నిడివి దాదాపు 3 గంటల 40 నిమిషాలుగా మారిపోయింది. ఇక ఓటీటీలోనూ కూడా ఇదే నిడివితోనే రిలీజ్ చేశారు.ఇదిలావుండగా ఇందులో అల్లు అర్జున్కు జంటగా రష్మిక మంధన్నా హీరోయిన్గా మెరిసింది. మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్, టాలీవుడ్ స్టార్స్ సునీల్, అనసూయ, జగపతిబాబు, రావు రమేశ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతం అందించగా, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్, రవి శంకర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: