తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. 1200 సినిమా ల్లో నటించిన ఈ లెజెండరీ కమెడియన్ ఇప్పుడు కాస్త రెస్ట్ తీసుకుంటున్నాడు. నచ్చిన కథలు వచ్చినపుడో,నచ్చిన మనషులు వచ్చి తప్పకుండా మీరు చేయాలి అని అడిగినపుడో తప్ప సినిమాలు చేయట్లేదీయన. కొన్నేళ్లుగా బ్రహ్మి చేస్తున్న సినిమాల సంఖ్య బాగా తగ్గిపోయిందిప్పుడు. అయితే ఇదే సమయంలో కేవలం సినిమాలు మాత్రమే కాదు.యాడ్స్, వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్నాడు బ్రహ్మానందం.ఇదిలావుండగా బ్రహ్మానందం ఇటీవల చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అవేమిటంటే ఇప్పటివరకు కామెడీ, సెంటిమెంట్ రోల్స్ తో అలరించిన ఆయన త్వరలోనే విలన్ గా కనిపిస్తానని ఓ మీటింగ్ లో చెప్పారు.ఆ విలనిజం థియేటర్స్ షేక్ అయ్యేలావుంటుందని అన్నారు.ఈ క్రమంలో కామెడీ రోల్స్ తో ప్రేక్షకులకు దగ్గరయినా ఆయన కొత్త పాత్ర లో ఎలా సర్ప్రైస్ చేస్తారోనని ఆశతో అభిమానులు ఎదురుచూస్తున్నారు.ఇక బ్రహ్మానందం ఇటీవల తరుణ్ భాస్కర్ తీసిన కీడా కోలా చిత్రంలో నటించి మెప్పించిన సంగతి విదితమే. ఇందులో బ్రహ్మానందం తనదైన నటనతో కడుపుబ్బా నవ్వించారు. ఇక గతేడాది వచ్చిన 'రంగమార్తాండ' చిత్రంలో చక్రపాణి పాత్రలో బ్రహ్మానందం నటవిశ్వరూపం చూపించిన సంగతి విదితమే.

ఆయన ఇన్నేళ్ల కెరీర్‌లో ఎప్పుడూ చేయనంత సీరియస్ పాత్రలో కనిపించగా ఆడియన్స్‌ ఎంతగా ఆ పాత్రని ఫీల్ అయ్యారో తెలియాల్సిన పనిలేదు.ఇదిలావుండగా తాజాగా ఈయన ఓ యాడ్ చేసాడు.. నీటికి సంబంధించిన ఎండోర్స్‌మెంట్ ఇది.ఇందులో బ్రహ్మానందంతో పాటు ఓ అబ్బాయి నటించాడు. ఆ కుర్రాడిని చూస్తుంటే ఎక్కడో చూసామే అనే ఫీలింగ్ అయితే తప్పకుండా కలుగుతుంది. ఈ యాడ్ వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ కుర్రాడి గురించే ఎక్కువ చర్చ జరుగుతుంది. ఎక్కడో చూసామే.. కానీ గుర్తు రావట్లేదే అంటూ తలలు అలా పట్టుకుంటున్నారంతా. ఇంతకీ ఆ కుర్రాడెవరో తెలుసా..? లెజెండరీ కమెడియన్ సుధాకర్ కొడుకు బెన్నీ. బ్రహ్మానందం నటిస్తున్న యాడ్‌తో బెన్నీ ఇంట్రడ్యూస్ అయ్యాడు. అక్కడున్నది సుధాకర్ కొడుకు అని చాలా మందికి తెలియకపోవచ్చు కానీ బ్రహ్మితో కలిసి నటిస్తే ఎవరీ కుర్రాడు అనే చర్చ అయితే మొదలవుతుంది కదా..! మరి బ్రహ్మి ఇమేజ్ బెన్నీకి హెల్ప్ అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: