నాగచైతన్య, సాయి పల్లవి  కలిసి నటించిన తండేల్  సినిమా ఫిబ్రవరి 7న విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం వహించిన విషయం తెలిసిందే.ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని పాటలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఇటీవల హైలెస్సా పాట విడుదల కాగా.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. హైలెస్సా స్టెప్లు ఏ సోషల్ మీడియా ఫ్లాట్ఫాం ఓపెన్ చేసినా కనిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా ఈ పాటకు దేవీశ్రీ ప్రసాద్ స్టెప్లు వేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దర్శకుడు చందు మెండేటి, దేవీశ్రీ కలిసి ఈ పాటకు స్టెప్లు వేశారు. గీతా ఆర్ట్స్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. వస్తున్నాం.. దుల్లగొడుతున్నామని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో దేవీశ్రీ డ్యాన్స్ దుల్లగొడుతున్నాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. భలేగా స్టెప్లు వేశాడని కామెంట్లు చేస్తున్నారు. దేవీశ్రీ అద్భుతంగా పాటలు పాడటమే కాదు.. డ్యాన్స్ వేసే టాలెంట్ కూడా తనలో ఉందని నెటిజన్లు అంటున్నారు. మరికొందరు తండేల్ విడుదలకు ముందే సక్సెస్ పార్టీ చేసుకుంటుందని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్ స్టెప్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇదిలావుండగా తండేల్ సినిమా ఫలితం పై గీతా ఆర్ట్స్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాతో నాగచైతన్య మంచి హిట్ తన ఖాతా లో వేసుకుంటాడని పేర్కొంటుంది. కాగా ఈ సినిమా రేపు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. మరోవైపు సాయి ధరమ్ తేజ్ మూవీ టీమ్ కు విషెస్ తెలియజేసారు.ఇదిలా ఉంటే.. విడుదలకు ముందే ఈ సరికొత్త రికార్డ్ సృష్టించింది. IMDb వెబ్‌సైట్ విడుదల చేసిన సమాచారం ప్రకారం తండేల్ ప్రస్తుతం భారతదేశంలోని ప్రజలు ఎక్కువగా ఎదురుచూస్తున్న చిత్రాలలో మొదటి స్థానంలో ఉంది. దీంతో ఈ మూవీపై దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎన్ని అంచనాలతో ఎదురుచూస్తున్నారో తెలుస్తోంది. సాయి పల్లవి నటించిన అమరన్ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ప్రజల నుండి అద్భుతమైన స్పందనను పొందింది. ఈ పరిస్థితిలో ప్రస్తుతం తండేల్ మూవీ భారీ హైప్ మధ్య విడుదలవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: