లవ్ స్టోరీ లాంటి సూపర్ హిట్ సినిమాల అనంతరం యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మరోసారి జంటగా కలిసి నటించిన చిత్రం తండేల్. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టోరీ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో మరోసారి వీరిద్దరూ కలిసి జంటగా తండేల్ సినిమాలో నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.


ఈ సినిమాలోని బుజ్జి తల్లి పాటకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. కాగా, తండేల్ సినిమాను కార్తికేయ-2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు దక్కించుకున్న డైరెక్టర్ చందు మొండేటి ఈ సినిమాను తెరకెక్కించాడు. బన్నీ వాసు, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అన్ని పనులు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 7వ తేదీన అంటే రేపు ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.


కాగా, ఈ సినిమాకు సంబంధించి ఈవెంట్ ను నిర్వహించారు. అందులో భాగంగా నాగచైతన్య మాట్లాడుతూ.... నిజమైన ప్రేమలో ఉండేటువంటి బాధను తండేల్ సినిమా ద్వారా చూపించబోతున్నామని యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య వెల్లడించారు. స్క్రిప్ట్, హీరో లుక్స్ కోసం దాదాపు 8 నెలల సమయాన్ని కేటాయించామని నాగచైతన్య తెలియజేశారు. ఈ సినిమాలో సాయి పల్లవి నటన చాలా అద్భుతంగా ఉందని అన్నారు.


తనతో కలిసి డ్యాన్స్ చేయడానికి ఎంతో కష్టపడ్డారని నాగచైతన్య అన్నారు. తనలాగా ఎవరు డ్యాన్స్ చేయలేరని నాగచైతన్య అన్నారు. శివ పార్వతుల స్ఫూర్తితో తమ పాత్రలు డిజైన్ చేశారని వెల్లడించారు. అందుకే ఈ సినిమాలో శివశక్తి థీమ్ సాంగ్ పెట్టామని నాగ చైతన్య అన్నారు. కాగా, ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా రేపు విడుదలవుతున్న నేపథ్యంలో ఇప్పటినుంచి థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంటోంది. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: