తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును నటులలో అక్కినేని నాగ చైతన్య ఒకరు. ఇకపోతే నాగ చైతన్య తాజాగా చందు మండేటి దర్శకత్వంలో తండెల్ అనే సినిమాలో హీరో గా నటించాడు. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని మొదలు పెట్టినప్పటి నుండి ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి కొన్ని ప్రచార చిత్రాలను , పాటలను మేకర్స్ విడుదల చేయగా అవి కూడా బాగుండడంతో ఈ సినిమాపై అంచనాలు ప్రేక్షకుల్లో మరింతగా పెరిగాయి. కానీ ఓ బ్యాడ్ సెంటిమెంట్ మాత్రం అక్కినేని అభిమానులను టెన్షన్ పేడుతున్నట్లు తెలుస్తోంది. అదేమిటి అనుకుంటున్నారా ..? కొంత కాలం క్రితం నాగ చైతన్య హీరోగా చందు మండేటి దర్శకత్వంలో ప్రేమమ్ అనే సినిమా రూపొందింది. మంచి అంచనాలను నడప విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద స్థాయిలో ఆకట్టుకోలేదు.

మూవీ తర్వాత నాగ చైతన్య హీరోగా చందు మండేటి "సవ్యసాచి" అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ కూడా మంచి అంచనాల నడమ విడుదల అయింది. కానీ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇలా ఇప్పటివరకు నాగ చైతన్య , చందు ముండేటి కాంబోలో రూపొందిన రెండు సినిమాలు కూడా బాక్సా ఫీస్ దగ్గర ఫెయిల్యూర్ కావడంతో వీరి కాంబోలో రూపొందిన మూడవ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న ఇప్పటికే వీరి కాంబోలో రూపొందిన రెండు సినిమాలు  అపజయాలు సాధించడంతో అక్కినేని అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. మరి తండెల్ మూవీ ని రేపు అనగా ఫిబ్రవరి 7 వ తేదీన విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: