సినిమా కైనా హిట్టు , ఫ్లాపు టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు పర్వాలేదు అనే స్థాయిలో కలెక్షన్లు వస్తూ ఉంటాయి. అదే స్టార్ హీరోలు నటించిన సినిమాలకైతే ఎలాంటి టాక్ వచ్చిన మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్స్ వస్తాయి. కానీ సినిమా హిట్ అవ్వాలి భారీ స్థాయిలో లాభాలను అందుకోవాలి అంటే లాంగ్ రన్ అనేది చాలా ముఖ్యం. లాంగ్ రన్ లో ఏ సినిమా అయితే భారీ కలెక్షన్లను వసూలు చేస్తుందో ఆ సినిమాకు భారీ కలెక్షన్లు వస్తాయి. అలాగే ఆ మూవీ ద్వారా నిర్మాతలకు , డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద మొత్తంలో లాభాలు వస్తూ ఉంటాయి. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో చాలా సినిమాలు లాంగ్ రన్ లో అద్భుతమైన కలక్షన్లను వసూలు చేసినవి ఉన్నాయి. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రోజులు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టిన టాప్ 5 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

బాహుబలి 2 : రెబల్ ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఏకంగా 28 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.

పుష్ప పార్ట్ 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రీమియర్స్ తో కలుపుకొని 26 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను రాబట్టింది.

బాహుబలి పార్ట్ 1 : ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 20 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.

సంక్రాంతికి వస్తున్నాం : వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా రూపొందిన ఈ సినిమా 20 రోజుల పాటు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది.

హనుమాన్ : తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రీమియర్స్ తో కలుపుకొని 20 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: