కొంత మంది ముద్దు గుమ్మలు తెలుగు భాషలో నటించకపోయిన టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో మాళవిక మోహన్ ఒకరు. ఈమె తమిళ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి కొన్ని విజయాలను అందుకొని కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈమె నటించిన కొన్ని తమిళ సినిమాలు తెలుగు లో కూడా విడుదల అయ్యాయి.

ఇకపోతే కొంత కాలం క్రితం ఈ బ్యూటీ కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన మాస్టర్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తెలుగు లో కూడా విడుదల అయ్యి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో ఈ నటికితెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ మూవీ లో ప్రభాస్ కి జోడిగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ మూవీ మరి కొంత కాలం లోనే విడుదల కానుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈమె ఏ తెలుగు సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించలేదు.

అలాగే ఈమె నటించిన ఒక్క తెలుగు సినిమా కూడా ఇంకా విడుదల కాలేదు. కానీ ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మాత్రం ఫుల్ క్రేజ్ ఉంది. దానికి ఒక కారణం ఈమె నటించిన డబ్బింగ్ సినిమాలు తెలుగులో విడుదల కావడం , మరో కారణం ఈమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేయడం. ఈమె తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసిన హాట్ లుక్ లో ఉన్న ఎన్నో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇండియా వ్యాప్తంగా ఈ బ్యూటీకి క్రేజ్ పెరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: