నాగచైతన్య నటించిన తండేల్ సినిమా రిలీజ్ కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. తండేల్ సినిమాకు హిట్ టాక్ వస్తుందని నాగచైతన్య బిగ్గెస్ట్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. శోభితతో పెళ్లి తర్వాత చైతన్యకు ఊహించని స్థాయిలో కలిసొస్తుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే శోభిత యాక్ట్ చేసిన వాటిలో రెండు ఇష్టమని నాగచైతన్య పేర్కొన్నారు.
శోభిత వాళ్లది వైజాగ్ అని మా ఇద్దరికీ ఆంధ్రా బ్యాగ్రౌండ్ అని చైతన్య వెల్లడించారు. మా ఇద్దరి సంస్కృతి, ఆచారాలు, సాంప్రదాయాలు ఒకటేనని చైతన్య కామెంట్లు చేశారు. శోభిత తెలుగు స్కిల్స్ అద్భుతంగా ఉంటాయని నాగచైతన్య వెల్లడించారు. శోభిత చాలా చక్కగా మాట్లాడుతుందని భాష విషయంలో శోభిత నాకెంతో సాయం చేస్తుంటుందని నాగచైతన్య పేర్కొన్నారు.
నేను ఏదైనా కార్యక్రమంలో స్పీచ్ ఇవ్వాల్సి వస్తే శోభిత నాకు హెల్ప్ చేస్తుందని నాగ చైతన్య వెల్లడించడం గమనార్హం. నాగచైతన్య చెప్పిన విషయాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మా వెడ్డింగ్ కు సంబంధించిన ప్రతిదీ శోభిత డిజైన్ చేస్తుందని నాగచైతన్య తెలిపారు. తండేల్ స్క్రిప్ట్ యూనివర్సల్ సబ్జెక్ట్ అని లవ్ స్టోరీ తర్వాత సాయిపల్లవితో వర్క్ చేయడం సంతోషంగా ఉందని నాగచైతన్య వెల్లడించారు.
నాగచైతన్య చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. నాగచైతన్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగ బిజీగా ఉండగా చైతన్య ఎంతో కష్టపడి కెరీర్ పరంగా అంచెలంచెలుగా ఎదిగారు. నాగచైతన్య తండేల్ సినిమాకు 15 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్నారు. చైతన్య బయక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు. శోభిత పెళ్లి తర్వాత కూడా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. శోభిత రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది. శోభిత క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.