![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_gossips/socialstars-lifestyle2df3d535-d2c9-4f01-88d6-f23981904d0d-415x250.jpg)
కానీ కాలక్రమేణా ఈ సినిమా నేటి తరం ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. స్పాట్ డబ్బింగ్ కాకుండా, నార్మల్ డబ్బింగ్ చేసి, కొన్ని సీన్స్ ని ఎడిటింగ్ చేసి, స్క్రీన్ ప్లే కాస్త వేగంగా ఉండుంటే ఈ చిత్రం అప్పట్లో రికార్డ్స్ ని కొల్లగొట్టేది అంటూ ఈ చిత్రాన్ని సోషల్ మీడియా లో చూసిన నెటిజెన్స్ కామెంట్స్ చేసారు. ఇది ఇలా ఉండగా తండేల్ మూవీ రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సందర్భంగా, ఆ చిత్ర నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ పలు మీడియా చానెల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఒక ఇంటర్వ్యూ లో ఆయన ‘జానీ’ మూవీ మేకింగ్ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలను, అదే విధంగా ఆ సినిమా ఫలితం గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఆయన మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ వరుసగా డబుల్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన తర్వాత నేను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన చిత్రమిది. ఈ సినిమాని తల్చుకుంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. పవన్ కళ్యాణ్ పీక్ టైం లో తన ఇమేజ్ ని పూర్తిగా పక్కన పెట్టి ఈ చిత్రాన్ని తీసాడు, ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక్క పెద్ద ప్రయోగమే. కానీ ఆ ప్రయోగాన్ని జనాలు స్వీకరించలేకపోయారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒకరోజు పవన్ కళ్యాణ్ కి కూడా ఈ చిత్రం ఎక్కడో తేడా కొట్టేలా ఉందని అనుమానం వచ్చింది. కానీ అప్పటికే షూటింగ్ చాలా వరకు పూర్తి అవ్వడంతో కొనసాగించాము. మేము అనుమానం పడినట్టే ఆ చిత్రానికి విడుదల తర్వాత జరిగింది. కానీ ఈ సినిమాకి ఆరోజుల్లో సెన్సేషనల్ ఓపెనింగ్స్ వచ్చాయి. విడుదలకు ముందు ఆడియో క్యాసెట్స్ అమ్మకాలు, సాటిలైట్ రైట్స్ అన్నీ రికార్డ్స్’ అంటూ చెప్పుకొచ్చాడు.