తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ హీరో లలో విశ్వక్ సేన్ ఒకరు. ఈయన ఈ నగరానికి ఏమైంది అనే సినిమాతో మంచి విజయాన్ని , మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు . ఆ తర్వాత ఈయన అనేక సినిమాలలో హీరోగా నటించి కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా , దర్శకుడిగా తనకంటూ మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇకపోతే విశ్వక్ సేన్ ఆఖరిగా మెకానిక్ రాకీ అనే సినిమాలో హీరో గా నటించాడు. పోయిన సంవత్సరం విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకపోతే తాజాగా విశ్వక్ సేన్ "లైలా" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఫిబ్రవరి 9 వ తేదీన చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవిని తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు , అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ బృందం వారు చిరంజీవిని కలిసి ఈ విషయం గురించి చెప్పగా ఆయన కూడా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే వెలువబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vs