విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తూ ఫుల్ జోష్లో ముందుకు దూసుకుపోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల అయింది. ఇకపోతే మూడవ వారం అత్యధిక షేర్ కలెక్షన్లను తెలుగు రాష్ట్రాల్లో రాబట్టిన సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా అద్భుతమైన స్థానంలో నిలిచింది.

మూడవ వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్ కలక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో బాహుబలి 2 సినిమా 18.20 కోట్ల కలెక్షన్లతో మొదటి స్థానంలో కొనసాగుతూ ఉండగా , హనుమాన్ సినిమా 16.01 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలోనూ , పుష్ప పార్ట్ 2 మూవీ 14.19 కోట్ల కలెక్షన్లతో 3 వ స్థానంలోనూ , దేవర పార్ట్ 1 మూవీ 12.92 కోట్ల కలెక్షన్లతో నాలుగవ స్థానంలోనూ , ఆర్ ఆర్ ఆర్ మూవీ 12.31 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానం లోనూ , కల్కి 2898 AD సినిమా 10.58 కోట్ల కలెక్షన్లతో ఆరవ స్థానంలోనూ , బాహుబలి పార్ట్ 1 మూవీ 10.50 కోట్ల కలెక్షన్లతో ఏడవ స్థానంలోనూ , వాల్టేరు వీరయ్య సినిమా 9.63 కోట్ల కలెక్షన్లతో 8 వ స్థానంలోనూ , అలా వైకుంఠపురంలో సినిమా 9.59 కోట్ల కలెక్షన్లతో 9 వ స్థానంలోనూ , సంక్రాంతికి వస్తున్నాం సినిమా 9.53 కోట్ల కలెక్షన్లతో పదవ స్థానంలో కొనసాగుతున్నాయి.

ఇకపోతే సంక్రాంతికి వస్తున్నాం సినిమా కంటే ముందు పదవ స్థానంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన అత్తారింటికి దారేది సినిమా 8.55 కోట్ల కలెక్షన్లతో కొనసాగుతూ ఉండగా , 11 వ స్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన రంగస్థలం మూవీ 8.45 కోట్లతో కొనసాగింది. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా పదవ స్థానం కు రావడంతో అత్తారింటికి దారేది సినిమా 11 వ స్థానానికి , రంగస్థలం సినిమా 12 వ స్థానానికి పడిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: