టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న హీరోయిన్లలో మీరా జాస్మిన్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఎన్నో తెలుగు సినిమాలలో నటించి తాను నటించిన ఎన్నో సినిమాల్లో క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఈమె ఎంతగానో ఆకట్టుకుంది. మీరా జాస్మిన్ కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా తమిళ , మలయాళ సినిమాలలో కూడా నటించింది. ఈమె అమ్మాయి బాగుంది అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాలో ఈమె తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

దానితో ఈమెకు తెలుగులో వరుస పెట్టి అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈమె అనేక తెలుగు సినిమాలలో నటించింది. ఇకపోతే ఈమె కెరియర్ బిగినింగ్ లో నటించిన భద్ర సినిమా ఈమెకు అద్భుతమైన గుర్తింపును తీసుకువచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడం , అందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత ఈమె క్రేజ్ భారీగా పెరిగింది. ఇక ఈమె ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన గుడుంబా శంకర్ సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది.

ఇకపోతే చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈమె ఈ మధ్య కాలంలో మళ్లీ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తూ వస్తుంది. ఈ నటి కొంత కాలం క్రితం విమానం అనే సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఇకపోతే మీరా జాస్మిన్ తన కెరియర్ లో ఎక్కువ శాతం క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికి కూడా ఈమె సినిమాల్లో క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలోనే నటిస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: