![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/poonam-bajwa5497ebdd-33b1-421a-bbb5-de2a0e0e495a-415x250.jpg)
అలాగే కన్నడ , మలయాళం లోను ఈమె పలు సినిమాలతో ట్రై చేసింది .. అయినా ఎలాంటి లాభం లేకుండా పోయింది .. అలానే ఓ దర్శకుడును రహస్యంగా పెళ్లి చేసుకొని వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచింది .. ఇంతకి ఈ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా? ప్రజెంట్ చాలామంది హీరోయిన్లు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు .. అలాంటి వారిలో పూనమ్ బజ్వా కూడా ఒకరు .. నవదీప్ హీరోగా వచ్చిన మొదటి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది .. ఆ తర్వాత ప్రేమంటే ఇంతే అనే సినిమాలో కూడా నటించింది .. అలాగే నాగార్జున హీరోగా వచ్చిన బాస్ సినిమాలను హీరోయిన్ ఫ్రెండ్ గా నటించింది .. వీటితోపాటు అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పరుగు సినిమాలో హీరోయిన్ అక్కగా నటించింది.
ఇక ఆ తర్వాత కోలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది .. అలాగే కన్నడ , మలయాళం భాషలో కూడా సినిమాలు చేసింది .. ఇక టాలీవుడ్లో చివరగా బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో ఈమె తలుకున మెరిసింది .. ఇక ఈ సినిమాలో గారపాటి లోకేశ్వరి పాత్రలో ఈమె కనిపించింది .. ప్రస్తుతం ఈ సీనియర్ బ్యూటీ అవకాశాలు లేక సోషల్ మీడియాలోనే ఎక్కువ కనిపిస్తుంది .. ఎప్పుడూ తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాని రఫ్ ఆడిస్తుంది .. ఇదిలా ఉంటే గతంలో కళ్యాణ్రామ్ హీరోగా వచ్చిన ఓం3d సినిమాను తెరకెక్కించిన సునీల్ రెడ్డితో పూనమ్ కి రహస్యంగా పెళ్లి జరిగిందని వార్తలు కూడా వచ్చాయి .. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు .. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.