![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/thandel-movie5a4239b0-d837-4991-8956-e6905082555f-415x250.jpg)
కొన్ని విషయాలు మనం అనుకుంటే జరగవు అలా వాటంతా అవి జరిగిపోతూ ఉంటాయి.. పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అయిన కాంతారా, కార్తికేయ 2 సినిమాలు ఈ కావులోకి వస్తాయి .. ఈ సినిమాలు నార్త్ లో భారీ హిట్ అవుతాయని ఆ సినిమా మేకర్స్ ఊహించలేదు .. తండేల్ కూడా అలాంటి సర్ప్రైజ్ విజయాన్ని తనకు ఇస్తుందని బలంగా నమ్ముతున్నాడు ఈ అక్కినేని హీరో. అందుకే కార్తికేయ 2 సక్సెస్ అయిన వెంటనే అల్లు అరవింద్ తో పాటు చైతు కూడా చందు మొండేటిని లాక్ చేసుకున్నారు .. ఇక సాయి పల్లవి ఇలాంటి హీరోయిన్ ను దేవిశ్రీ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకున్నారు .. అలాగే వీరు మాత్రమే కాకుండా టోటల్ టెక్నికల్ టీమ్ అంతా చాలా స్ట్రాంగ్ గా పెట్టుకున్నారు .
వీటన్నిటికీ అల్లు అరవింద్ ఆర్థికంగా ఎంతో వెసులుబాటు కల్పించారు .. దీని ఫలితంగా మంచి క్వాలిటీ రెడీ అయింది .. ఇక ఇప్పుడు మిగిలింది పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందనేది తెలియాలి .. అన్ని కలిసొచ్చినట్టు ఈ అదృష్టం కూడా కలిసి వచ్చి ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయితే అక్కినేని ఫ్యామిలీ కోరిక నాగచైతన్య కళ నెరవేరినట్టు అవుతుంది .. నాగచైతన్య తండేల్‌తో ఎలాంటి సర్ప్రైజ్ అందుకుంటాడో చూడాలి.