ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎన్నో సినిమాలు మంచి గుర్తింపు దక్కించుకుంటాయి. అంతేకాకుండా కలెక్షన్లను సైతం సొంతం చేసుకుంటాయి. అలాంటి సినిమాలలో యానిమల్ సినిమా ఒకటి. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద యానిమల్ సినిమా ఎంత పెద్ద ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్ని రోజులపాటు ఎక్కడ చూసినా యానిమల్ సినిమా గురించే మాట్లాడుకున్నారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటించారు. త్రిప్తి దిమ్రి సెకండ్ హీరోయిన్ గా అద్భుతంగా నటించింది.



ఈ సినిమాలో ఈ చిన్నదాని నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. రష్మిక కన్నా తృప్తి నటననే బాగుందని ప్రశంసలు సైతం వచ్చాయి. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్, రొమాంటిక్ సన్నివేశాలలో నటించిన ఈ చిన్నది మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన అన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ కుర్రాళ్లకు మతులు పోగడుతోంది. తన అందాలను ఆరబోస్తూ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇస్తోంది. ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్స్ ఉన్నారు.

ఇదిలా ఉండగా.... ఆషికి ఫ్రాంచైజీ నుంచి థర్డ్ ఇన్ స్టాల్ మెంట్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తుండగా నటిస్తున్నారు. అనురాగ్ బసు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోయిన్ అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో దీపికా పదుకొనే, కత్రినా కైఫ్ లాంటి హీరోయిన్లను పెట్టాలని అనుకున్నారు. కానీ వారి కన్నా కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని అనుకున్నారట. ఆకాంక్ష శర్మని హీరోయిన్గా పెట్టి తీయాలని అనుకొని చివరికి త్రిప్తి దిమ్రికి ఈ అవకాశాన్ని ఇచ్చారు.

ఆకాంక్ష కన్నా తృప్తి అయితే హీరో కార్తీక్ కి సరిగ్గా సెట్ అవుతుందని అనురాగ్ పిలిచి మరి ఛాన్స్ ఇచ్చారట. ఈ సినిమా స్టోరీ నచ్చడంతో తృప్తి కూడా ఓకే చెప్పిందట. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుంచి తృప్తి తప్పుకుందట. పిలిచి మరి అవకాశం ఇస్తే ఇలా ఎగ్జిట్ అవడంతో అనురాగ్ కాస్త ఈ విషయం పట్ల అసంతృప్తిగా ఉన్నారట. కాగా, ఈ బ్యూటీ సినిమాలో నటిస్తానని చెప్పి దర్శకుడు వద్ద భారీగా డబ్బులను కాజేసిందట. చివరికి నటించనని చెప్పి హ్యాండ్ ఇచ్చిందట. దీంతో ఆ దర్శకుడిని భారీగా వాడుకొని మోసం చేసిందని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం పైన క్లారిటీ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: