రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేని కుటుంబం నుంచి తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ హీరో తన సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. యూత్ లో ముఖ్యంగా విజయ్ దేవరకొండకు ఎంతగానో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన సినిమాలు అంటే ఎగబడి చూసేవారు ఎందరో ఉన్నారు. హిట్లు, ఫ్లాప్లు అనే తేడా లేకుండా విజయ్ ఎప్పటికప్పుడు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులకు చేరువలో ఉంటారు. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం లైగర్. 


సినిమా ఆగస్టు 25, 2022న థియేటర్లలో రిలీజ్ అయింది. కాగా, ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. లైగర్ సినిమాను రూ. 125 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించగా రూ. 60.80 కోట్ల కలెక్షన్లు మాత్రమే రాబట్టింది. అంటే రూ. 64.20 కోట్ల నష్టం లైగర్ సినిమాకు వచ్చింది. దీంతో సినిమా నిర్మాతలు భారీగా నష్టపోయారు. కాగా, ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటనకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ అనన్య పాండే నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి.


సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు దారుణంగా నష్టపోయారు. అంతేకాకుండా వారికి నష్టపరిహారాన్ని చెల్లించాలని డిస్ట్రిబ్యూటర్లు గొడవ సైతం చేశారు. తమకు నష్టపరిహారం చెల్లించకుండా నైజాంలో డబుల్ ఇస్మార్ట్ సినిమాను రిలీజ్ చేసేది లేదంటూ ఎగ్జిబిటర్లు మరియు డిస్ట్రిబ్యూటర్లు ఫిల్మ్ చాంబర్ లో కూడా ఆశ్రయించడం జరిగింది. ఇదిలా ఉండగా... లైగర్ సినిమాలో అనన్య నటన ఎంతో బాగుంది. కాగా, ఈ సినిమా గురించి అనన్య పాండే తండ్రి చంకీ పాండే సంచలన కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో నటించడానికి మొదటగా అనన్య పాండే అసలు ఒప్పుకోలేదట.


కానీ పూరి జగన్నాథ్ బలవంతంగా ఒప్పించినట్టుగా వెల్లడించారు. ఈ సినిమాలో కాస్త రొమాంటిక్ సన్నివేశాలు ఉండడంతో అనన్య పాండే చాలా అసౌకర్యంగా ఫీల్ అయిందట. ఆ పాత్రకు తన వయసు అస్సలు సరిపోదని అనన్య పాండే చెప్పిందట. కానీ పూరి జగన్నాథ్ బలవంతం వల్లనే లైగర్ సినిమాలో నటించినట్లుగా చంకీ పాండే వెల్లడించారు. కాగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర విజయాన్ని చవి చూసింది. ఈ సినిమా అనంతరం విజయ్ దేవరకొండ వరుసగా సినిమాలలో నటిస్తుండడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: