![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/khaidi-movie-karthi-movie-kamal-haasan4f228bee-3a74-4cba-8cd7-1f71cbcf882b-415x250.jpg)
రజనీకాంత్ తో పాటుగా చాలామంది ప్రముఖ నటీనటులు నటిస్తూ ఉన్నారు. శృతిహాసన్ ,నాగార్జున, ఉపేంద్ర తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తూ ఉండగా.. ఖైదీ సినిమా సీక్వెల్ ఎప్పుడు ఉంటుందా అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఖైదీ సినిమా 2019లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా నుంచి ఎల్సీయూ అంటూ చాలా సినిమాలు లింక్ అయ్యి విడుదలయ్యాయి. ఖైదీ 2 లో కమలహాసన్ కూడా కనిపిస్తారని గతంలో వార్తలు వినిపించాయి. విక్రమ్ సినిమా విడుదలై సక్సెస్ అయిన సమయంలో ఈ రూమర్స్ మరింత వైరల్ గా మారాయి.
అయితే ఇప్పుడు తాజాగా ఖైదీ 2 సినిమా గురించి మరొక న్యూస్ వినిపిస్తోంది. ఏమిటంటే ఈ ఏడాది ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కాబోతోందని ఈ సినిమాతో పాటుగా మరొక సినిమా బెంజ్ అనే చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారట. ఈ చిత్రాన్ని డైరెక్టర్ భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహించేలా ప్లాన్ చేస్తూ ఉండగా ఇందులో నటుడుగా రాఘవ లారెన్స్ కూడా ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారట. అలాగే ఈ సినిమాని ఎల్సీయూ కనెక్షన్స్ కి కూడా లింక్ చేసే విధంగా లోకేష్ కనకరాజు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మరి ఖైదీ 2 లో కమలహాసన్ నటిస్తారా లేకపోతే రాఘవ లారెన్స్ కనిపిస్తారని విషయం తెలియాల్సి ఉంది.