నాగచైతన్య అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడోతరం హీరోగా వచ్చిన నటుడు నాగచైతన్య అని చెప్పవచ్చు..తాత అక్కినేని నాగేశ్వరరావు తండ్రి అక్కినేని నాగార్జున నటవరసత్వాన్ని అందిపుచ్చుకొని తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతోంది. అయినా ఈయనకు స్టార్ హీరో స్టేటస్ మాత్రం రాలేదు. ఒక సినిమా హిట్ అయితే వరుసగా రెండు కంటే ఎక్కువ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. అలా నాగచైతన్య పడుతూ లేస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మొదటిసారి పాన్ ఇండియా లెవెల్ లో ఒక చిత్రంతో మన ముందుకు రాబోతున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటయ్యా అంటే తండేల్.. అయితే ఇందులో చైతు రాజు అనే  మత్స్యకారుని పాత్రలో అద్భుతంగా నటించాడు.. ముఖ్యంగా చేపలు పట్టే మత్స్యకారుల యదార్థ సంఘటనల ఆధారంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు..

 ఈ చిత్రం కథ విషయానికి వస్తే కొందరు మత్స్యకారులు సముద్రంలో చేపలు పట్టుకుంటూ పొరపాటున పాక్ భూభాగంలోకి వెళ్లడం అక్కడ పాక్ సైన్యం వారు వీరిని పట్టుకొని అక్కడ శిక్షించడం వంటివి ఈ చిత్రంలో ప్రధానంగా ఆకట్టుకుంటాయి. అయితే ఫిబ్రవరి 7న ఈ సినిమా రిలీజ్ కి ముందే సినిమాకు సంబంధించి సెన్సార్ టాక్ బయటకు వచ్చింది.. అయితే ఈ సినిమా పూర్తిగా గూస్ బంప్స్ పుట్టిస్తుందట.. ఇందులో సాయిపల్లవి నటన చైతు సాయి పల్లవి మధ్య నడిచే లవ్ ట్రాక్ కూడా అందరినీ ఆకట్టుకుంటుందని అంటున్నారు..

మరీ ముఖ్యంగా పాకిస్తాన్ జైలు ఎపిసోడ్ సముద్రంలో షూట్ చేసిన ఒక ఫైట్ సీన్ ఈ సినిమాకి హైలెట్ అవుతున్నాయి. ఇక సెకండాఫ్  విషయానికి వస్తే చాలా ఎమోషనల్ గా సాగుతుందని, క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అదిరిపోతోందని అంటున్నారు.. అంతేకాకుండా ఈ సినిమాలో సాయిపల్లవి నటన అందరికీ నచ్చుతుందని టాక్ వినిపిస్తోంది.. ఇదే తరుణంలో క్లైమాక్స్ సినిమా స్టోరీని మొత్తం మలుపు తిప్పుతుందని ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో సహా సినిమా చూడవచ్చని వారు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: