ఇప్పటికే ఈ సినిమా టైలర్ రిలీజ్ వేడుక ముంబాయిలో జరిగింది. ఈ సినిమాలోని 'జానే తూ..' అనే గీతాన్ని ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఇదిలా ఉండగా.. నటుడు విక్కీ కౌశల్, నటి కత్రినా కైఫ్ పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల విక్కీ కౌశల్ తన ప్రేమ వివాహం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. 'కత్రినాను నేను మొదటిసారి కలిసిన క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోను. 2019లో నేను ఓ అవార్డుల కార్యక్రమానికి హోస్ట్ గా చేశాను. మాకు పరిచయం కూడా అప్పుడే ఏర్పడింది. తొలిసారి ఆమెను కలిసినప్పుడు చాలా బాగా అనిపించింది. మొదటి సారి ఆమెని కలిసినప్పుడే చాలా స్వీట్ గా అనిపించింది. ఇక మెల్లమెల్లగా మా పరిచయం స్నేహంగా మారింది. ఆ తర్వాత ప్రేమ, వెంటనే పెళ్లి జరిగింది' అని విక్కీ చెప్పుకొచ్చాడు.
ఇక ఛావా సినిమాలో నటించడం తనకి చాలా నచ్చిందని చెప్పుకొచ్చాడు. శంభాజీ మహరాజ్ లాంటి గొప్ప పాత్రలో నటించడం మామూలు విషయం కాదని.. ఆ పాత్ర దొరకడం తన అదృష్టం అని తెలిపాడు. జీవితంలో ఇలాంటి అవకాశం ఒక్కసారే వస్తుందని ఆయన చెప్పాడు. ఈ సినిమా కోసం తాను శారీరకంగా.. అలాగే మానసికంగా ఎంతగానో శ్రమించనని తెలిపాడు. ఈ సినిమా షూటింగ్ కి ముందే విక్కీ కత్తి శాము, యుద్దాలు, గుర్రపు స్వారీలలో శిక్షణ తీసుకున్నట్లు చెప్పాడు.