![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/cinema-e6063fc0-eea8-45e1-a3da-cdeb6042eaba-415x250.jpg)
ఈ సినిమా హిట్ అవ్వడానికి ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. సాయి పల్లవి ఒక ఎత్తు. ఆమె ఒక సినిమాలో నటిస్తుందంటే చాలు ఆ సినిమా పక్క హిట్ కోడతుందని ముందే ఫిక్స్ అయిపోవాల్సిందే. ఎందుకంటే ఆమె సినిమాలను సెలెక్ట్ చేసుకునే విధానమే వేరు. అలాగే ఆ సినిమాలో సాయి పల్లవి నటన మామూలుగా ఉండదు. ఇక ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ అందించిన బుజ్జితల్లి పాటతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. 'రాజూ.. ఊర్లో అందరూ ఏతేటో మాతాదుకుంతన్నార్రా.. నీకు నాకు ఏతేతో ఉన్నట్టు మాతాదుకుంతన్నార్రా.. ఇప్పుడేంతావే.. అందరూ ఏతో మాతాదుకుంతన్నారు కదా.. అది నిజం చేచేత్తే ఎట్టా ఉంటాదా అని' అని ట్రైలర్ లో సాయి పల్లవి శ్రీకాకుళం యాసలో ఒక డైలాగ్ చెప్పింది.
ఇదిలా ఉండగా.. ఈ సినిమా ఇప్పటికే ప్రమోషన్స్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా గీత ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పించారు. తాజాగా అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. 'ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరలు తక్కువగా ఉన్నాయి. అందుకే కేవలం రూ. 50 మాత్రం పెంచామని అడిగాము. కానీ తెలంగాణ సర్కార్ ని మేం ఏం అడగలేదు. టికెట్ ధరల విషయంలో మేం కల్పించుకోలేదు. తండేల్ సినిమాకు బెనిఫిట్ షోలు లేవు. అలాగే ఈ సినిమాను ఏరియాల వారీగా అమ్మేద్ధం అని అడిగారు కానీ నేను మాత్రం మనమే విడుదల చేద్దాం అని అన్నాను' అంటూ అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.