![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/cinema-65959f5c-ad97-4422-858a-09a51448d10d-415x250.jpg)
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో మోడల్ సోనూగా, అమ్మాయి లైలాగా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న రోల్స్‌లో విశ్వక్ సేన్ నటిస్తున్నాడు. ఈ సినిమా రామ్ నారాయణ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతుంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ కి జోడీగా తొలి పరిచయం ఆకాంక్షా శర్మ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.
అయితే ఈ సినిమా టీజర్ విడుదల అయిన విషయం తెలిసిందే. ఆ టీజర్ లో విశ్వక్ సేన్ లేడిగా కనిపించారు. లేడి లుక్ లో విశ్వక్ ఆకట్టుకున్నారు. ఇక బీజీఎమ్, మ్యూజిక్ అయితే అదిరిపోయింది. లైలా సినిమా కోసం టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. ఈ మూవీకి రిచర్డ్ ప్రసాద్ డీవోపీ కాగా, వాసుదేవ మూర్తి రైటర్. ఇక బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో విశ్వక్ ఫిమేల్ పాత్రకు డబ్బింగ్ ఓ గాయిని చెప్తుంది. లైలా సినిమాలో లేడి గేటప్ పాత్రకు సింగర్ శ్రావణ భార్గవి వాయిస్ ఇచ్చినట్లు తెలుస్తోంది.