![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/9-pm-is-enough-sai-pallavi-interesting-comments044f5c41-8fd5-49d2-851b-f92ea2ddd84c-415x250.jpg)
ఈ సినిమా హిట్ అవ్వడానికి ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. సాయి పల్లవి ఒక ఎత్తు. ఆమె ఒక సినిమాలో నటిస్తుందంటే చాలు ఆ సినిమా పక్క హిట్ కోడతుందని ముందే ఫిక్స్ అయిపోవాల్సిందే. ఎందుకంటే ఆమె సినిమాలను సెలెక్ట్ చేసుకునే విధానమే వేరు. అలాగే ఆ సినిమాలో సాయి పల్లవి నటన మామూలుగా ఉండదు. అయితే ఇటీవల సాయి పల్లవి అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానలు ఇచ్చింది. అందులో భాగంగా ఆమె తనకి నటనతో పాటు తేనెటీగల పెంపకం అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. ఈ మధ్యే ఆ పని కూడా మొదలు పెట్టినట్లు చెప్పుకొచ్చింది. అలాగే తనకి బన్ తో తయారు చేసిన ఆహారం అంటే చాలా ఇష్టమని.. వాటిని చాలా ఇష్టంగా తింటానని తెలిపింది. కొబ్బరి నీళ్లు కూడా ఎక్కువగా తీసుకుంటానని చెప్పింది. ఇక తన ఎక్కడ ఉన్న సరే రాత్రి 9 గంటలు అయితే చాలు నిద్రపోతుంది అంట.
ఇటీవల ఈ సినిమా డైరెక్టర్ సాయి పల్లవిని ఆకాశానికి ఎత్తేశాడు. ఆమెని స్వామి వివేకానందతో పోల్చారు. ఆమె వృత్తి పట్ల ఎంతో నిబద్దతతో పనిచేస్తుందని తెలిపారు. సాయి పల్లవి అంటే ఆశ్చర్యం అని.. కెమెరా ఆన్ చేస్తే చాలు.. ఎక్కడున్నామని ఏం ఆలోచించారని చెప్పారు. ఈ సినిమా చేసేటప్పటికి సాయి పల్లవి అమరన్ చేస్తున్నారని అన్నారు. దాంతో పాటు రామాయణం కూడా చేస్తున్నారని తెలిపారు. ఎలాంటి మేకప్ వేయకుండా కేవలం నటన, నాట్యంతో అందరిని మెప్పించే ఏకైక హీరోయిన్ సాయి పల్లవి అని చెప్పుకొచ్చాడు.