ఒక వ్యక్తి వాంగ్మూలం కేసులో ఈయన రాకపోవడంతో పంజాబ్ లోని లూథియానా కోర్టు సైతం ఈ ఉత్తర్వులను జారీ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. జుడిషియల్ మెజిస్ట్రేట్ రమన్ ప్రీతి కౌర్ సైతం ఈ వారంట్ నీ జారీ చేస్తూ సోనుసూద్ ని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలనే విధంగా ఉత్తర్వులను జారీ చేసినట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళితే.. లూథియానా కు చెందినటువంటి అడ్వకేట్ రాజేష్ ఖన్నా తనకు మోహిత్ శర్మ అనే వ్యక్తి దగ్గర నుంచి పది లక్షల రూపాయలు మోసం చేశారంటూ కోర్టులో కేసు వేయడం జరిగిందట.
రిజికా కాయిన్ అనే పేరుతో తనతో పెట్టుబడి పెట్టించారని ఈ కేసులో సదరు న్యాయవాది సైతం సోను సూద్ ని సాక్షిగా తెలియజేశారట. అయితే విచారణ చేపట్టిన అనంతరం కోర్టు సోను సూదుకు నాన్బెయిల్ అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నోసార్లు సోను సూద్ కు సామాన్లు పంపించినప్పటికీ హాజరు కాలేదట. దీంతో వెంటనే తనని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలి అంటూ మెజిస్ట్రేషన్ పలు రకాల ఉత్తర్వులను విడుదల చేశారట ఈ కేసు ఈనెల 10వ తేదీ మరొకసారి విచారణ కాబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఆరోజు సోనుసూద్ వెళ్తారా లేకపోతే ఏమన్నది తెలియాల్సి ఉన్నది.