భారీ అంచనాల మధ్య విడుదలైన పాన్ ఇండియా మూవీ తండేల్.. 2025 ఫిబ్రవరి 7న విడుదలైన నాగచైతన్య తండేల్ మూవీ ఒకరోజు ముందుగానే యూఎస్ లో ప్రీమియర్ షోలు పడిపోయాయి.ఇప్పటికే ఈ సినిమా చూసిన చాలా మంది ట్విట్టర్ ద్వారా తమ స్పందన తెలియజేస్తున్నారు. ఇక తెలంగాణలో టికెట్ రేట్లు పెంచకపోయినప్పటికీ ఏపీ ప్రభుత్వం మాత్రం సినిమా వారికి తోచినంత సహాయం చేస్తుంది.ఎందుకంటే రీసెంట్ గా విడుదలైన ప్రతి సినిమాకి బెనిఫిట్స్ తో పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించింది. అలా తండేల్ మూవీ కి కూడా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించింది. అయితే తాజాగా విడుదలైన తండేల్ మూవీ ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. గీత ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మాతగా చేసిన తాజా మూవీ తండేల్.. చందు మొండేటి డైరెక్షన్లో దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించిన తండేల్  మూవీ ఫైనల్ గా ఫిబ్రవరి 7న విడుదలైంది. ఈ సినిమా నుండి విడుదలైన గ్లిమ్స్, పోస్టర్, టీజర్, ట్రైలర్,పాటలు అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ముఖ్యంగా ఇందులోని బుజ్జి తల్లి, శివతాండవం, హైలెస్సా అనే పాటలు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇక సినిమా రివ్యూ విషయానికి వస్తే.. యూఎస్ లో ప్రీమియర్ షోలు చూసిన చాలామంది ఫస్టాఫ్ అంత బాగా లేదని, ఫస్టాఫ్ పై డైరెక్టర్ ఇంకా కాన్సన్ట్రేషన్ చేసి ఉంటే బాగుండేది అని రివ్యూ ఇస్తున్నారు. అలాగే సెకండాఫ్ లో కొన్ని ఎమోషన్స్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.కానీ డైరెక్టర్ ఈ సినిమాపై మరింత దృష్టి పెట్టి ఉంటే ఇంకా బాగుండేది అని మాట్లాడుకుంటున్నారు.ఈ కథని ఇంకా బాగా తెరకెక్కిస్తే బాగుండు అని,ఫస్టాఫ్ స్లోగా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం కాస్త ఆకట్టుకుంది అని రివ్యూ ఇస్తున్నారు. అలాగే సినిమాకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ సత్య పాత్రలో నటించిన సాయి పల్లవి యాక్టింగ్, తండేల్ రాజు పాత్రలో నటించిన నాగచైతన్య యాక్టింగ్ సినిమాకి ప్లస్ అయింది అని,ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది అని ట్విట్టర్ ద్వారా సినిమా చూసిన నెటిజన్లు రివ్యూలు ఇస్తున్నారు.

అలాగే ఈ సినిమాలో దేశభక్తికి సంబంధించిన సన్నివేశాలు చాలా బాగున్నాయని కూడా కామెంట్లు పెడుతున్నారు. ఇక నాగచైతన్య జీవితంలోనే ఆయన పోషించిన ఈ పాత్ర ఎప్పటికీ మర్చిపోలేనిదని,ఒక మంచి పాత్రలో నాగచైతన్య ఫస్ట్ టైం కనిపించారని కొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. నాగచైతన్యకు ఇది కం బ్యాక్ మూవీ అవుతుందని కొంతమంది రివ్యూ ఇస్తే మరి కొంత మందేమో సినిమాని ఇంకా బాగా తెరకెక్కించాల్సింది అని, వావ్ అనేంతలా లేదు కానీ ఓకే ఓకే అనేలా ఉంది అంటూ కొంతమంది పాజిటివ్ కొంతమంది నెగటివ్గా ఇలా మిశ్రమ స్పందన వస్తోంది. ఇక టోటల్ రివ్యూ వచ్చేవరకు ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చెప్పలేం

మరింత సమాచారం తెలుసుకోండి: