చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య సాయి పల్లవి నటించిన తాజా మూవీ తండేల్..ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్ షోస్ చూసిన చాలా మంది జనాలు ట్విట్టర్ ద్వారా రివ్యూ ఇస్తూ కొంతమంది పాజిటివ్ కొంతమంది నెగటివ్గా స్పందిస్తున్నారు. అయితే చాలామంది ఈ సినిమా చూసిన జనాలు అదొక్కటే సినిమాకి పెద్ద మైనస్ అని ఎక్కువ శాతం మంది కామెంట్లు చేస్తున్నారు. రియల్ స్టోరీగా తెరకెక్కిన తండేల్ మూవీ గురించి ముందుగా ఎంతగానో సెర్చ్ చేసి ఆ తర్వాత సినిమా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా కోసం నాగచైతన్య సాయి పల్లవి ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఇప్పటికే ప్రమోషన్స్లో పాల్గొన్న సమయంలో చిత్ర యూనిట్ బయటపెట్టారు. ఈ సినిమా కోసం నాగచైతన్య బాగా హార్డ్ వర్క్ చేశారని,వాళ్ల భాష నేర్చుకోవడంతోపాటు మత్స్యకారులు లాగే మారిపోయి అందులో ఒదిగిపోయి నటించారని అంటున్నారు.అయితే తాజాగా విడుదలైన తండేల్ సినిమాలోని ప్లస్ లు మైనస్ లు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
 

తండేల్  సినిమా ప్లస్ లు :
 తండేల్ సినిమాకి పెద్ద ప్లస్ ఏంటంటే దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్..ఈ సినిమాకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ దేవి శ్రీ ప్రసాద్ చాలా అద్భుతంగా ఇచ్చారని సినిమా చూసినవాళ్లు కామెంట్లు పెడుతున్నారు. అలాగే ఈ సినిమాలో పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయని పాటలు చూడడం కోసమైనా సినిమాకి వెళ్లాల్సిందే అని రివ్యూ ఇస్తున్నారు. ఇక ఈ సినిమాకి మరొక ప్లస్ ఏంటంటే..నాగచైతన్య సాయి పల్లవిల యాక్టింగ్.. సాయి పల్లవి మరోసారి తన యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకుంది. అలాగే నాగచైతన్య ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా చూడని విధంగా ఈ సినిమాలో చూసాం.ఈ సినిమాలో నాగచైతన్య యాక్టింగ్ వేరే లెవెల్ ఒక సర్ప్రైజింగ్ క్యారెక్టర్ లో ఈయన ఇప్పటివరకు నటించని పాత్రలో నటించారు.ఈ సినిమాకి చైతు సాయి పల్లవిల యాక్టింగ్ కూడా పెద్ద ప్లస్ అయింది. అలాగే దేశభక్తి పోర్షన్ కూడా ఎంతో బాగుంది అని,ఇంటర్వెల్ సీన్ అయితే ఈ సినిమాకి పెద్ద హైలెట్ అంటూ రివ్యూలు ఇస్తున్నారు. పాటల పిక్చరైజేషన్ అద్భుతంగా ఉంది అని, చైతు సాయి పల్లవి ల కెమిస్ట్రీ అదరహో అంటూ కామెంట్లు పెడుతున్నారు.అలాగే డైరెక్టర్ కూడా ఈ సినిమాని చాలా రియలిస్టిక్ గా తెరకెక్కించారని, నిజ జీవితంలోని వారి పాత్రలకు దగ్గరగా ఈ సినిమాని తెరకెక్కించారని సెకండాఫ్ చాలా అద్భుతంగా ఉంది అని కనీసం ఒక్కసారైనా ఈ సినిమాని ఫ్యామిలీతో సహా చూడవచ్చు అని రివ్యూ ఇస్తున్నారు.ఈ సినిమాకి ఇంటర్వెల్ సీన్ తో పాటు క్లైమాక్స్ పెద్ద ప్లస్ పాయింట్స్ .

 తండేల్ సినిమా మైనస్ లు:
 తండేల్ సినిమాకి అతిపెద్ద మైనస్ ఏంటంటే .. సినిమా స్టార్ట్ అయ్యే సమయం లో వచ్చే మొదటి 30 నిమిషాలు.సినిమా మొదటి 30 నిమిషాలు అస్సలు బాగాలేదని, ఇందులో లవ్ స్టోరీ ఆజ్ యూజ్ వల్ గా ఉండడంతోపాటు కథనం కూడా చాలా స్లోగా సాగింది అని రివ్యూ ఇస్తున్నారు. ఈ 30 నిమిషాలు సినిమాని చూసే ప్రేక్షకులకు కాస్త బోరింగ్ అని,ఇది ఒక్కటే సినిమాకి పెద్ద మైనస్ అయింది అని కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: