![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/thandela182f8d9-094b-4309-bf84-4f9a44a38c44-415x250.jpg)
దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.. గతంలో చందూ మొండేటి నాగ చైతన్యతో ప్రేమమ్, సవ్య సాచి వంటి సూపర్ హిట్ మూవీస్ తెరకెక్కించాడు..ఇప్పుడు వస్తున్న “ తండేల్ “ సినిమాతో హాట్రిక్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు ఎక్కడ విన్నా తండేల్ సాంగ్సే వినిపిస్తున్నాయి.రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించాడు.. లవ్‌స్టోరీ సినిమా తర్వాత నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ సమర్పణలో బన్నీ వాసు భారీ స్థాయిలో నిర్మించాడు..ఈ సినిమా నేడు (ఫిబ్రవరి 7)న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది..
ఇప్పటికే యూఎస్ ప్రీమియర్ షోస్ ద్వారా సినిమా ఎలా వుందో టాక్ బయటకు వచ్చింది.. సినిమాలో నాగచైతన్య మాస్ ఎంట్రీ ఇస్తాడు.నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరు ఎవరికీ వారు తమ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టారు.. వారిద్దరి మధ్య వచ్చే లవ్ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయి.. సినిమాలో సాంగ్స్ ఇప్పటికే పెద్ద హిట్ కాగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఓం నమో నమః శివాయ సాంగ్ హైలైట్ గా నిలుస్తుందని సినిమా చూసిన ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు... ఈ సాంగ్ లో సాయి పల్లవి, నాగ చైతన్య ఇద్దరూ అద్భుతమైన డాన్స్ మూమెంట్స్ తో ఆకట్టుకున్నారు.
ఈ సాంగ్ తర్వాత కథ ఎమోషనల్ గా మారుతుందని సమాచారం..సినిమాలో మొదటి గంట కాస్త స్లో గా సాగిన ఇంటర్వల్ ఇంట్రెస్టింగ్ సీన్ తో సినిమా కథ ప్రేక్షకులలో ఆసక్తిని కలిగించింది.. దేవిశ్రీ మ్యూజిక్ కూడా అదిరిపోవడంతో ప్రేక్షకులకి ఎక్కడ బోర్ కలిగించదు..అయితే దర్శకుడు చందూ మొండేటి రాసుకున్న కథను నేరేట్ చేయడంలో తడబడినట్లు తెలుస్తుంది..సెకండ్ హాఫ్ లో దేశభక్తికి సంబందించిన సన్నివేశాలు అద్భుతంగా వున్నా మరికొన్ని సీన్స్ మాత్రం ఎంగేజింగ్ గా లేకపోవడం సినిమాకి కాస్త మైనస్ అయినట్లు తెలుస్తుంది.. ఓవారల్ గా తండేల్ ఓ ఫీల్ గుడ్ మూవీగా నిలుస్తుంది..