టాలీవుడ్ స్టార్ దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు ఏదో ఒక గొడవ పెట్టుకునే రాంగోపాల్ వర్మ... ఇప్పుడు... పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన రామ్ గోపాల్ వర్మ... తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో మాత్రం పిల్లిలా మారిపోయారు. కూటమి ప్రభుత్వం పెట్టేటువంటి కేసులను చూసి భయపడిపోతున్నారు రాంగోపాల్ వర్మ.


సోషల్ మీడియాలో టిడిపికి గతంలో వ్యతిరేకంగా అనేక పోస్టులు పెట్టారు. అలాగే రకరకాల సినిమాలు కూడా తీశారు రాంగోపాల్ వర్మ. అయితే గతంలో చేసిన పనులకు ఇప్పుడు రాంగోపాల్ వర్మ ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఏపీలో వరుసగా రాంగోపాల్ వర్మపై కేసులు పెట్టడం జరిగింది టిడిపి నేతలు. ఈ ధర్నంలోనే ఇవాళ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు దర్శకుడు రాంగోపాల్ వర్మ వెళ్లాల్సి వచ్చింది. ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ సీఐ కార్యాలయంలో ఇవాళ  విచారణకు హాజరుకానున్నారు సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ.

మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో గత నవంబర్ లో వర్మపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయితే... ఈ కేసులో అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ తీసుకున్నారు వర్మ. ఇక పోలీసుల విచారణకు సహకరించాలని టాలీవుడ్ స్టార్ దర్శకుడు రాంగోపాల్ వర్మ కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది కోర్టు. ఇక గతంలో పలుసార్లు పోలీసుల విచారణకు డుమ్మా కొట్టిన వర్మ..ఇవాళ విచారణకు వస్తున్నారు.

ఫిబ్రవరి 4న విచారణకు హాజరుకావాలని ఇటీవల పోలీసులు టాలీవుడ్ స్టార్ దర్శకుడు రాంగోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.... ఈ నెల 7న అంటే నేడు విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు టాలీవుడ్ స్టార్ దర్శకుడు రాంగోపాల్ వర్మ. దీంతో ఇవాళ విచారణకు హాజరవుతానని విచారణాధికారి సీఐ శ్రీకాంత్‌కు సమాచారం ఇచ్చిన ఆర్జీవీ.. నేడు  పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లనున్నారు. ఈ తరుణంలోనే...టాలీవుడ్ స్టార్ దర్శకుడు రాంగోపాల్ వర్మ హాజరుపై ఉత్కంఠత కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

RGV