![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/business_videos/thandel-review4a2c79fb-4768-47e0-b896-27e5d654d183-415x250.jpg)
ఇక ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య హీరోగా చేయగా సాయి పల్లవి హీరోయిన్ గా చేయడం జరిగింది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్ పనిచేశారు. బన్నీ వాసు అలాగే అల్లు అరవింద్ నిర్మాతలుగా ఉన్నారు. ఈ తండేల్ సినిమా సముద్రం అలాగే పాకిస్తాన్ ఇండియా బ్యాగ్రౌండ్ లో వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నో అంచనాల మధ్య ఇవాళ ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది.
సినిమా రిలీజ్ కాగానే... అందరూ బాగుందని చెబుతున్నారు. దీంతో సినిమా చూసేందుకు జనాలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ ప్రాణం పోసినట్లు తెలుస్తోంది. అతని మ్యూజిక్ కారణంగా సినిమాకు మంచి ప్లేస్ అయిందని.. సినిమా చూసినవారు చెబుతున్నారు. ప్రేమ కథ చిత్రాలకు దేవిశ్రీప్రసాద్... మంచి మ్యూజిక్ అందిస్తారు. ఇక ఈ సినిమాలో కూడా... బ్యాగ్రౌండ్ మ్యూజిక్, మ్యూజిక్ కూడా దుమ్ము లేపాడు.
ఒక్కో మాట గూస్ బంప్స్ రావాల్సిందే. బుజ్జి తల్లి ఇలాంటి పాటలకు మంచి మ్యూజిక్ అందించాడట దేవిశ్రీప్రసాద్. అటు ఈ సినిమాలో హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సాయి పల్లవి అద్భుతంగా నటించినట్లు చెబుతున్నారు. ఈ సినిమాకు దర్శకుడుగా ఉన్న చందు కూడా అద్భుతంగా సీన్లు చిత్రీకరించారట. ఓవరాల్ గా నాగచైతన్య నటించిన తండేల్ సినిమాపై పాజిటివ్ టాక్ బయటకు వచ్చేసింది. దీంతో కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనే దాని పైన చర్చ జరుగుతోంది.