నాగచైతన్య చందూ మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కిన తండేల్ మూవీ ఈరోజే థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఒకరిద్దరు నెగటివ్ గా స్పందిస్తున్నా ఎక్కువమంది ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చేసింది. తండేల్ మూవీతో సాయిపల్లవికి అవార్డ్ పక్కా అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
సాయిపల్లవి తన అద్భుతమైన నటనతో మెప్పించారు. ఈ సినిమాతో సాయిపల్లవికి అవార్డ్ పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తండేల్ సినిమాలో చైతన్య యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉందని సమాచారం అందుతోంది. నిర్మాత అల్లు అరవింద్ కు తండేల్ మూవీ భారీ లాభాలను అందించడం పక్కా అని తెలుస్తోంది. తండేల్ సినిమా కాన్సెప్ట్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తోంది.
 
తండేల్ సినిమా 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను అందించిందని తెలుస్తోంది. తండేల్ సినిమాకు డీఎస్పీ మ్యూజిక్, బీజీఎం హైలెట్ గా నిలిచాయని సమాచారం అందుతోంది. తండేల్ సినిమాలో నాగచైతన్య లుక్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తండేల్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
 
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తండేల్ సినిమాకు పోటీ ఇచ్చే సినిమా కూడా లేదనే సంగతి తెలిసిందే. వచ్చే వారం లైలా మూవీ విడుదలవుతుండగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాలి. తండేల్ సినిమా చైతన్య సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే ఛాన్స్ అయితే ఉంది. తండేల్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి. తండేల్ మూవీ ఇండస్ట్రీని షేక్ చేసే మూవీ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: