ఏంటి యష్ నిజంగానే తన వైవాహిక జీవితంలో ఆనందంగా లేరా.. భార్యతో గొడవలు పెట్టుకుంటున్నారా.. విభేదాల కారణంగానే బెంగళూరులో ఉన్నా కూడా యష్ తన ఇంటికి 10 రోజులుగా వెళ్లడం లేదా..ఇంతకీ యష్ జీవితంలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం.. కేజిఎఫ్ 1, 2 సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.ఈ రెండు సినిమాలతో ఓవర్ నైట్ లో యష్ ని స్టార్ ని చేశాయి. ఈ సినిమా తర్వాత యష్ జీవితం పూర్తిగా మారిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా పేరుగాంచారు. అయితే అలాంటి ఈ హీరో ప్రస్తుతం గీతా మోహన్దాస్ దర్శకత్వంలో టాక్సిక్ అనే సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమాలో హీరోయిన్ గా యనతారని తీసుకున్నారు. అయితే తాజాగా యష్ వైవాహిక జీవితం గురించి ఒక షాకింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం ఈ వార్త కన్నడ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. అదేంటంటే.. ప్రస్తుతం యష్ కి సంబంధించిన టాక్సిక్ మూవీ బెంగళూరులో షూటింగ్ జరుపుకుంటుందట.ఇన్ని రోజులు ఇతర ప్రదేశాలలో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ తాజాగా బెంగళూరులోనే షూటింగ్ జరుపుకుంటుందట. అయితే 10 రోజుల నుండి బెంగళూరులో షూటింగ్ జరుపుకున్నా కూడా ఇప్పటివరకు  యష్ తన ఇంటికి వెళ్లలేదట.. అయితే ఈ విషయం యష్ సినిమా చేస్తున్న చిత్ర యూనిట్ లోని కొంతమంది బయటికి లీక్ చేయడంతో చాలామంది నెటిజెన్స్ ఎందుకు యష్ ఇంటికి వెళ్లడం లేదు.. షూటింగ్ ముగించుకున్నాక బెంగళూరులో ఉన్న తన సొంత ఇంటికి వెళ్లడానికి ఎందుకు యష్ ఆసక్తి చూపించడం లేదు అని కొత్త చర్చ జరుగుతుంది.

అంతేకాదు యష్ జీవితంలో ఏదైనా అనుకోని సంఘటన జరగబోతుందా? రాధికతో ఆయనకు ఏమైనా గొడవలు వచ్చాయా.. అందుకే 10 రోజులైనా ఇంటికి వెళ్లకుండా షూటింగ్ సెట్ లోనే ఉంటూ క్యారవాన్ లో పడుకుంటూ అక్కడే తింటున్నారా అని చాలా మంది చర్చించుకుంటున్నారు. కానీ మరి కొంతమంది ఏమో భార్యతో గొడవలు లాంటివి ఏమీ లేవు. కానీ ఆయనకు సినిమా మీద ఉన్న డెడికేషన్ అలాంటిది కావచ్చు. ఇంటికి వెళ్తే మళ్లీ సినిమా షూటింగ్ కి రావడానికి లేట్ అవుతుంది అనే కారణంతో క్యారవ్యాన్ లోనే పడుకుంటున్నారు కావచ్చు అని మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియాలో యష్ వైవాహిక జీవితం గురించి అనేక పుకార్లు వైరల్ అవుతున్నాయి. ఇక దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: