నాగచైతన్య .. నిన్న మొన్నటి వరకు ఈ పేరు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురైంది . ఎంతలా నాగచైతన్య పేరుని దారుణంగా హింసించారు.. ట్రోల్ చేశారు.. టార్చర్ చేశారు అందరికీ తెలిసిందే . అయితే నాగచైతన్య అలాంటివి పెద్దగా పట్టించుకోలేదు . ఒకటి కాదు రెండు కాదు వేళలో ట్రోలింగ్ జరిగిన సింపుల్గా ట్రోలింగ్ మొత్తాన్ని పాజిటివిటీగా మార్చేసుకున్నారు . సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య పై జనాలు ఓ రేంజ్ లో విడిచిపెట్టారు . నెగిటివ్ ట్రోల్లింగ్ కూడా చేశారు . కానీ నాగచైతన్య ఎక్కడ అప్సెట్ అవ్వకుండా తన పని తాను చూసుకుంటూ వెళ్లిపోయాడు .


మరీ ముఖ్యంగా రీసెంట్గా శోభిత ధూళీపాళ్లను పెళ్లి చేసుకున్న తర్వాత నాగచైతన్య లైఫ్ మొత్తం టర్న్ అయిపోయింది అని ఓ రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు. కాగా నాగచైతన్య పెళ్లి తర్వాత నటించిన ఫస్ట్ మూవీ "తండేల్". ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . ఎక్కడ చూసినా సరే జనాలు పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు . నాగచైతన్య నటన అదుర్స్ అని.. సాయి పల్లవి ఎప్పటిలాగే 100% సినిమాకి నయం చేసింది అని మాట్లాడుకుంటున్నారు .



ఈ సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నట్లయ్యింది నాగచైతన్య . అయితే ఇప్పుడు జనాలకి ఒక బిగ్ డౌట్ వచ్చేసింది.  ఈ సినిమాలో బుజ్జి తల్లి పాత్ర ఆయనకు చాలా స్పెషల్.  ఎందుకంటే శోభిత ధూళిపాళ్లను ఆయన ముద్దుగా బుజ్జి తల్లి అని పిలుచుకుంటాడు. కాగా రీల్ లైఫ్ లో సాయి పల్లవి కూడా అదే పేరు పెట్టి సినిమాను ఫినిష్ చేశారు.  కాగా తెరపై ఇద్దరికీ కెమిస్ట్రీ సూపర్ డూపర్ గా వర్క్ అవుట్ అయింది . ఎంతలా అంటే రియల్ లైఫ్ లో నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల మధ్య కూడా అంత కెమిస్ట్రీ ఉండదేమో అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి . దీంతో నాగచైతన్య లైఫ్ కి హిట్ తెచ్చి పెట్టిన ఆ బుజ్జితల్లి ఎవరు..? శోభిత ధూళిపాళనా..? సాయి పల్లవి నా ..? చాలామంది ఎవరు ఊహించిన విధంగా సాయి పల్లవి కి సపోర్ట్ చేస్తున్నారు.  సాయి పల్లవి నాగచైతన్యల జంట సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు . దీంతో సోషల్ మీడియాలో నాగచైతన్య -శోభిత- సాయి పల్లవి పేర్లు మారుమ్రోగిపోతున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: