అయిపోయింది.. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అనుకుంటున్నా మూవీ రిలీజ్ అయిపోయింది . ఎవరు ఊహించని విధంగా నాగచైతన్య సూపర్ కాన్సెప్ట్ తో నటించినదే ఈ సినిమా. ఈ "తండేల్" మూవీ డైరెక్టర్ చందు ముండేటి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకోవడమే కాకుండా ఫ్యాన్స్ కి ఫుల్ మిల్స్ లా అయిపోయింది . నాగచైతన్య సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలు వేసుకుంటే చూడాలి అనేది అక్కినేని అభిమానుల కోరిక .


ఇన్నాళ్ళకి అక్కినేని వారసుడిగా చెప్పుకోదగ్గ హిట్ కొట్టాడు అంటూ కూడా అభిమానులు మాట్లాడుకుంటున్నారు . మరి ముఖ్యంగా ఈ సినిమాలో నాగచైతన్య పర్ఫామెన్స్ హైలెట్ గా మారింది అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు . అయితే ఈ సినిమాలో సాయి పల్లవి డాన్స్ పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అని .. ఈ సినిమా హిట్ అవ్వడానికి సాయి పల్లవి కూడా ప్రధాన కారణం అంటూ మాట్లాడుతున్నారు . ట్వీట్స్ చేస్తున్నారు . ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో ఇదే వార్త బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.



అయితే "తండేల్" సినిమా థియేటర్ లోనే చూడటానికి మెయిన్ రీసన్ ఇవే అంటూ మూడు కారణాలు కూడా చెప్పుకొస్తున్నారు. చందు మొండేఅటి డైరెక్షన్ చాలా చాలా బాగుంది అని .. ఆ ఒరిజినల్ అట్మాస్ఫియర్ ని నేచర్ ని ఎంజాయ్ చేయాలి అంటే బిగ్ స్క్రీన్ పైన మాత్రమే చూడాలి అంటున్నారు. అంతేకాదు సాయి పల్లవి నెమలిలా నాట్యమాడిన డాన్స్ దేవిశ్రీప్రసాద్ కొట్టిన బిజిఎం చాలా బాగుంది అని .. అలా థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్ బాగుంటుంది అని చెప్పుకొస్తున్నారు . అంతేకాదు సినిమాలో కొన్ని కొన్ని ఫైట్ సీన్స్ చాలా బాగా  ఆకట్టుకుంటాయి అని . అసలు చందు మొండిటి దగ్గర నుంచి అలాంటి ఫైట్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేయలేకపోయాము అని ..ఖచ్చితంగా ఆ ఫైట్ సీన్స్ కోసం కూడా థియేటర్ కి వెళ్లి జనాలు సినిమా చూడాలి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు . మొత్తానికి చాలా కాలం తర్వాత నాగచైతన్య తన ఖాతాలో ఓ  హిట్ వేసుకున్నాడు . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు నాగచైతన్య పేరు మారుమ్రోగిపోతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: