ఆన్లైన్లో గేమ్ కారణంగా ఎస్సార్ నగర్ ప్రాంతంలో పోలీసులు సైతం నీలేష్ చోప్రా అనే వ్యక్తిని అరెస్టు చేశారని అది తమ వద్దకు వచ్చిందని అయితే సదురు వ్యక్తి వైజయంతి మూవీ సంస్థలో ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా పని చేయలేదని.. తమకు అవగాహన ఉన్నంతవరకు అతడికి సమస్థకు ఎలాంటి సంబంధం లేదంటూ వైజయంతి మూవీస్ బ్యానర్ వారు సోషల్ మీడియా వేదికగా ఒక విషయాన్ని తెలియజేయడం జరిగింది. అయితే ఈ విషయాలను ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ దృష్టికి కూడా తీసుకువెళ్లారు మీడియా మిత్రులు.
ఎవరైనా సరే ఇలాంటి విషయాలను పోస్ట్ చేసేటప్పుడు దయచేసి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి అంటూ వైజయంతి మూవీస్ సంస్థ కోరుకుంటోంది.చాలా కాలం పాటు సినీ రంగానికి దూరంగా ఉన్న వైజయంతి మూవీస్ గత ఏడాది ప్రభాస్ కల్కి 2898 Ad అనే చిత్రంతో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా భారీ కలెక్షన్స్ ని కూడా రాబట్టేలా చేసింది.ప్రస్తుతం హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటిస్తున్న ఛాంపియన్ అనే ఒక చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తూ ఉన్నారు. అలాగే కల్కి సీక్వెల్ని కూడా తెరకెక్కించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది చిత్రబృందం. ఇలాంటి సమయంలోనే వైజయంతి మూవీస్ బ్యానర్ పైన ఇలాంటి రూమర్స్ రావడంతో క్లారిటీ ఇచ్చేసింది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.