![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/naga-chaitanya5fe28dbd-d6e9-47ef-8de7-e8d63b779041-415x250.jpg)
నాగచైతన్య రీసెంట్ గా హీరోగా నటించిన "తండేల్" సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . నాగచైతన్య "తండేల్" సినిమాలో ఆయన పర్ఫామెన్స్ టూ పిక్స్ కి వెళ్ళిపోయింది . అసలు నాగచైతన్య ఇంత బాగా నటిస్తాడని జనాలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు . అంతేకాదు సాయి పల్లవి - నాగచైతన్యల మధ్య వచ్చిన కెమిస్ట్రీ సీన్స్ కూడా బాగా ఆకట్టుకున్నాయి. వీరిద్దరి మధ్య వచ్చే డైలాగ్స్ చాలా ఫన్నీగా నాటిగా రియలిస్టిక్ గా ఉండడం కూడా థియేటర్స్ లో జనాలను బాగా ఆకట్టుకునేలా చేసింది.
సోషల్ మీడియాలో ఇప్పుడు నాగచైతన్య ఈ సినిమా కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అనే వార్త బాగా ట్రెండ్ అవుతుంది. నాగచైతన్య ఈ సినిమా కోసం తన కెరియర్ లోనే హైయెస్ట్ రికార్డ్ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . దాదాపు ఈ సినిమా కోసం 25 కోట్లు తీసుకున్నారట . ఇప్పటివరకు ఆయన కెరియర్ లో ఏ సినిమాకి కూడా ఇంత పారితోషం తీసుకోలేదట . ఈ సినిమా కోసం అంత కష్టపడ్డాడు నాగ చైతన్య. కచ్చితంగా రిజల్ట్ పాజిటివ్ గానే ఉంటుంది అని ధీమా వ్యక్తం చేశాడు. అనుకున్నట్లే సూపర్ డూపర్ హిట్ అయింది ఈ మూవీ . చూడాలి మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..???