విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని జనవరి 14 వ తేదీన విడుదల చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 23 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 23 రోజుల్లో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఎన్ని కోట్ల లాభాలు ఈ మూవీ కి 23 రోజుల్లో వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

23 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 41.32 కోట్ల కనెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 42 కోట్లు , ఉత్తరాంధ్రలో 21.85 కోట్లు , ఈస్ట్ లో 54 కోట్లు , వెస్ట్ లో 8.78 కోట్లు , గుంటూరు లో 10.25 కోట్లు , కృష్ణ లో 9.47 కోట్లు , నెల్లూరు లో 4.66 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి 23 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 128.29 కోట్ల షేర్ ... 207.35 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి 23 రోజుల్లో కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 8.75 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఓవర్సీస్ లో 16.76 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 23 రోజుల్లో 153.80 కోట్ల షేర్ ... 265.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 41.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 42.50 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇక 23 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 111.30 కోట్ల లాభాలు వచ్చాయి. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: