![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/movie-d078a773-a5d3-4cb9-8c65-3dfe908a65c9-415x250.jpg)
ఈ సినిమా హిట్ అవ్వడానికి ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. సాయి పల్లవి ఒక ఎత్తు. ఆమె ఒక సినిమాలో నటిస్తుందంటే చాలు ఆ సినిమా పక్క హిట్ కోడతుందని ముందే ఫిక్స్ అయిపోవాల్సిందే. ఎందుకంటే ఆమె సినిమాలను సెలెక్ట్ చేసుకునే విధానమే వేరు. అలాగే ఆ సినిమాలో సాయి పల్లవి నటన మామూలుగా ఉండదు. అయితే ఇటీవల సాయి పల్లవి అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానలు ఇచ్చింది. అందులో భాగంగా ఆమెని దర్శకత్వం చేయాలనుకుంటే ఎలాంటి సినిమాకు చేస్తారు అని అడిగారు. దానికి ఆమె మాట్లాడుతూ.. తాను దర్శకత్వం చేయనని చెప్పుకొచ్చింది. అలాగే దర్శకత్వం చేయాలనే ఆలోచన కూడా తనకి లేదని తెలిపింది. ఇక ఈ అందాల భామకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈమెకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈమె నటనతో లేడి పవర్ స్టార్ అని పేరు కూడా సొంత చేసుకుంది.
ఇక ఈ సినిమా డైరెక్టర్ చందు ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ.. సాయి పల్లవిని స్వామి వివేకానందతో పోల్చారు. ఆమె వృత్తి పట్ల ఎంతో నిబద్దతతో పనిచేస్తుందని తెలిపారు. సాయి పల్లవి అంటే ఆశ్చర్యం అని.. కెమెరా ఆన్ చేస్తే చాలు.. ఎక్కడున్నామని ఏం ఆలోచించారని చెప్పారు. ఈ సినిమా చేసేటప్పటికి సాయి పల్లవి అమరన్ చేస్తున్నారని అన్నారు. దాంతో పాటు రామాయణం కూడా చేస్తున్నారని తెలిపారు.