తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో అక్కినేని నాగ చైతన్య ఒకరు. ఈయన జోష్ అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఏం మాయ చేసావే మూవీ తో నాగ చైతన్య కు మంచి కమర్షియల్ విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కింది. ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించిన చైతూ అందులో చాలా మూవీ లతో మంచి విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. కొంత కాలం క్రితం నాగ చైతన్య చందు మండేటి దర్శకత్వంలో తండెల్ అనే సినిమాను మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ , బన్నీ వాసు ఈ మూవీ ని నిర్మించారు. ఇకపోతే ఈ సినిమాను ఈ రోజు అనగా ఫిబ్రవరి 7 వ తేదీన తెలుగు , తమిళ , హిందీ భాషలలో విడుదల చేశారు. ఇది ఇలా ఉంటే గతంలో నాగ చైతన్య , చందు మండేటి కాంబినేషన్లో ప్రేమమ్ , సవ్యసాచి అనే మూవీలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దానితో అక్కినేని అభిమానులు ఈ సినిమాతో నైనా ఆ బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ కాకూడదు అని అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వచ్చారు.

ఇక ఈ రోజు విడుదల అయిన తండెల్ మూవీ కి మంచి పాజిటివ్ టాక్ వస్తుంది. మరి ముఖ్యంగా సినిమా మొత్తం ఒకెత్తు ఆఖరి 20 నిమిషాలు అద్భుతంగా ఉన్నట్లు ఆ 20 నిమిషాల తోనే సినిమా స్థాయి పెరిగినట్లు మూవీ బ్లాక్ బస్టర్ కన్ఫామ్ అని పలు రివ్యూలు వస్తున్నాయి. దానితో చైతూ , చందు కాంబో మూవీస్ బ్యాడ్ సెంటిమెంట్ ఈ మూవీ తో బద్దలయ్యాయి అని అక్కినేని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: